Asianet News TeluguAsianet News Telugu

KKR vs CSK : కేకేఆర్ ను గ‌డ‌గ‌డ‌లాడించిన జ‌డ్ఢూభాయ్, తుషార్ దేశ్ పాండే..

IPL 2024 KKR vs CSK : 2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) 22వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ లైనప్‌ను చెన్నై సూపర్ కింగ్స్ స్టార్లు తుషార్ దేశ్‌పాండే, రవీంద్ర జడేజాలు దెబ్బతీశారు.
 

Ravindra Jadeja and Tushar Deshpande Pandey hit KKR, IPL 2024 KKR vs CSK RMA
Author
First Published Apr 8, 2024, 11:12 PM IST

IPL 2024 KKR vs CSK :  చెపాక్ మైదానంలో రవీంద్ర జడేజా బంతితో మ్యాజిక్ చేశాడు. జడ్డూ భాయ్ స్పిన్నింగ్ బంతుల ముందు కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ (కేకేఆర్) బ్యాట్స్‌మెన్ పూర్తిగా నిస్సహాయంగా కనిపించారు. త‌న అద్భుత‌మైన బౌలింగ్ తో కేకేఆర్ స్టార్ల‌ను పెవిలియ‌న్ కు పంపాడు. వీరిలో సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీలను త‌న ఒకే ఓవర్‌లో పెవిలియ‌న్ కు పంపాడు. త‌న 4 ఓవ‌ర్ల బౌలింగ్ లో 18 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.

 

అలాగే, చెన్నై సూప‌ర్ కింగ్స్ బౌల‌ర్ తుషార్ దేశ్ పాండే కూడా అద్భుత‌మైన బౌలింగ్ తో అద‌ర‌గొట్టాడు. దేశ్‌పాండే నాలుగు ఓవర్లలో 3 వికెట్లు ప‌డ‌గొట్టాడు. దీంతో త‌న 28 మ్యాచ్ ల ఐపీఎల్ కెరీర్ లో 30 వికెట్లు ప‌డ‌గొట్టాడు. అలాగే, ఒక సారి కేకేఆర్ పై 5 వికెట్లు తీశాడు. గ‌త సీజ‌న్ లో 21 వికెట్లు తీసుకుని అత్యధిక వికెట్లు తీసిన చెన్నై సూప‌ర్ కింగ్స్ బౌల‌ర్ గా నిలిచాడు. మొత్తంగా అత‌ను త‌న 72 టీ20 మ్యాచ్ ల‌లో 104 వికెట్లు సాధించాడు. ఐపీఎల్ లో 100 క్యాచ్ లను పూర్తిచేసుకుని మరో ఘనత సాధించాడు. అలాగే, ముస్తాఫిజుర్ రెహమాన్ రెండు వికెట్లు సాధించాడు.

 

IPL 2024 : ట్రిస్ట‌న్ స్టబ్స్ దేబ్బ‌కు స్ట‌న్న‌య్యారు.. ఎవ‌డ్రా వీడు ఇలా కొట్టేశాడు.. !

ఈ క్ర‌మంలోనే జ‌డ్డూభాయ్ కేకేఆర్ పై అత్య‌ధిక వికెట్లు సాధించిన మూడో బౌల‌ర్ గా ఘ‌నత సాధించాడు. కేకేఆర్ తో ఆడిన 31 మ్యాచ్ ల‌లో 22 వికెట్లు పడగొట్టాడు. జ‌డ్డూ భాయ్ కంటే ముందు ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌పై అధిక వికెట్లు తీసిన వారిలో భువనేశ్వర్ కుమార్ (32 వికెట్లు), యుజ్వేంద్ర చాహల్ (28 వికెట్లు), రవిచంద్రన్ అశ్విన్ (24 వికెట్లు) ఉన్నారు. అలాగే, డ్వేర్ బ్రావో కేకేఆర్ పై సాధించిన 21 వికెట్లను అధిగ‌మించాడు జ‌డ్డూభాయ్. మొత్తంగా జడేజా 231 ఐపీఎల్ మ్యాచ్ ల‌లో 7.58 ఎకానమీతో 156 వికెట్లు పడగొట్టాడు. మూడు సార్లు నాలుగు వికెట్లు, ఒక సారి ఐదు వికెట్లు సాధించాడు. చెన్నై త‌ర‌ఫున 177 మ్యాచ్‌లలో 138 వికెట్లు సాధించాడు. అలాగే, 128.94 స్ట్రైక్ రేట్‌తో 2,776  ఐపీఎల్ ప‌రుగుల‌ను సాధించాడు జ‌డ్డూ భాయ్. ఇందులో రెండు హాఫ్ సెంచ‌రీలు కొట్టాడు.

 

కాగా, ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన 20 ఓవ‌ర్ల‌లో 137-9 ప‌రుగులు చేశారు. 138 ప‌రుగులు టార్గెట్ తో బ‌రిలోకి దిగిన చెన్నై టీమ్ 17.4 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి 141 ప‌రుగులు సాధించింది. కేకేఆర్ పై 7 వికెట్ల తేడాతో సీఎస్కే విజ‌యం సాధించింది. రుతురాజ్ గైక్వాడ్ 67 ప‌రుగులు కెప్టెన్ ఇన్నింగ్స్ తో విజ‌యాన్ని అందించాడు. 

IPL 2024 : ట్రిస్ట‌న్ స్టబ్స్ దేబ్బ‌కు స్ట‌న్న‌య్యారు.. ఎవ‌డ్రా వీడు ఇలా కొట్టేశాడు.. !

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios