Asianet News TeluguAsianet News Telugu

ఐపీఎల్ 'ఇంపాక్ట్ ప్లేయర్ రూల్' పై అశ్విన్ కామెంట్స్ వైరల్.. ఏం చెప్పాడంటే?

IPL 2025: టీమిండియా స్టార్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ లో అమల్లో ఉన్న ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల కోచింగ్ సిబ్బందికి వ్యూహాత్మకంగా ఎక్కువ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఇంపాక్ట్ సబ్‌గా ఐపీఎల్‌లో అరంగేట్రం చేసి ప్రస్తుతం టెస్టుల్లో భారతదేశం తరపున నెంబర్ వన్ వికెట్ కీపర్‌గా ఉన్న ధ్రువ్ జురెల్ ఉదాహరణను ప్రస్తావించారు.

Ravichandran Ashwin Explains Support for Impact Player Rule in IPL, Why RMA
Author
First Published Aug 29, 2024, 4:21 PM IST | Last Updated Aug 29, 2024, 4:21 PM IST

IPL 2025-Ravichandran Ashwin : టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో అమలులో ఉన్న ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇప్పటికే ఈ రూల్ పై క్రికెట్ వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కు అశ్విన్ మద్దతుగా నిలిచారు. ఐపీఎల్ 2023 సీజన్ లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ని ప్రవేశపెట్టారు. గతేడాది బ్యాటింగ్ జట్లు పెద్ద పెద్ద స్కోర్లు సాధించడంతో ఈ రూల్ చర్చనీయాంశంగా మారింది. రోహిత్ శర్మ, క్రిష్ శ్రీకాంత్ వంటి ప్రస్తుత, మాజీ ఆటగాళ్ళు ఈ రూల్ వల్ల ఆల్ రౌండర్ల అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. మాజీ భారత కెప్టెన్ శ్రీకాంత్ యూట్యూబ్ షో 'చీకీ చీకా'లో అశ్విన్ మాట్లాడుతూ.. "ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అంత చెడ్డది కాదని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇది వ్యూహాత్మకంగా మరికొన్ని అవకాశాలను కల్పిస్తుంది. దీనికి వ్యతిరేకంగా ఉన్న వాదన ఏమిటంటే ఇది ఆల్ రౌండర్లను ప్రోత్సహించదు. కానీ ఎవరూ వారిని ఆపడం లేదు" అని అన్నారు.

“ఈ తరం ఆటగాళ్ళు అలా చేయరు (బ్యాటర్లు బౌలింగ్ చేయడం). ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల వారు నిరుత్సాహపడుతున్నారని కాదు. వెంకటేష్ అయ్యర్ ని చూడండి, అతను ప్రస్తుతం అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇన్నోవేషన్ కు అవకాశం ఉంది. ఇది ఆటను మరింత నిష్పక్షపాతంగా చేస్తుంది" అని ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ అన్నారు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న అశ్విన్ ఇంకా మాట్లాడుతూ..  ధ్రువ్ జురెల్ వంటి ప్రతిభావంతులను వెలుగులోకి తీసుకురావడానికి ఈ రూల్ తమ ఫ్రాంచైజీకి సహాయపడిందని నొక్కి చెప్పారు. గౌహతిలో పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఇంపాక్ట్ సబ్‌గా వచ్చిన ఈ భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ 15 బంతుల్లో 32* పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత అతను వెనుతిరిగి చూసుకోలేదు. ఫిబ్రవరి 2024 లో ఇంగ్లాండ్ తో జరిగిన హోం టెస్ట్ సిరీస్ తో అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. ఈ 23 ఏళ్ల జురెల్ మూడు టెస్టుల్లో 90 పరుగుల అత్యధిక స్కోరుతో మొత్తం 190 పరుగులు చేశారు. 

ధోని లేకుండానే యువరాజ్ సింగ్ బయోపిక్? ఎందుకు? ఇది సాధ్యమేనా?

“అన్నిటికంటే ముఖ్యంగా, ధ్రువ్ జురెల్… ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ లేకపోతే, అతనికి అవకాశం వచ్చేది కాదేమో” అని అశ్విన్ అన్నాడు. “కాబట్టి చాలా మంది ఆటగాళ్ళు ఈ రూల్ తో వెలుగులోకి వచ్చారు. ఆటగాళ్ళు వెలుగులోకి రావడానికి ఇదే ఏకైక మార్గం అని నేను చెప్పడం లేదు, కానీ ఇది అంత చెడ్డది కాదు” అని అశ్విన్ అన్నారు. వ్యూహాలు, ఎత్తుగడల పరంగా, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల కోచింగ్ సిబ్బందికి మరికొన్ని అదనపు అవకాశాలు లభిస్తాయని అశ్విన్ అభిప్రాయపడ్డారు. రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన నాకౌట్ దశ మ్యాచ్ ను ఉదాహరణను అశ్విన్ ప్రస్తావించారు.  

రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసి 9 వికెట్లకు 175 పరుగులు చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ షాబాజ్ అహ్మద్ ను ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకొచ్చింది. 23 పరుగులిచ్చి కీలక సమయంలో 3 వికెట్లు తీసుకున్నాడు. హైదరాబాద్ గెలుపులో మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు. మంచు కారణంగా మ్యాచ్ లు ఏకపక్షంగా మారే అవకాశం ఉన్నప్పుడు, సెకండ్ ఇన్నింగ్స్ బౌలింగ్ చేసే జట్లకు కౌంటర్ గా అదనపు అవకాశం లభిస్తుందని అశ్విన్ అన్నారు. “మీరు రెండో ఇన్నింగ్స్  బ్యాటింగ్ చేస్తుంటే, అదనపు బౌలర్ స్థానంలో బ్యాటర్ ని తీసుకోవడం ద్వారా వ్యూహాత్మకంగా సబ్‌స్టిట్యూషన్ చేయవచ్చు. మ్యాచ్ లు మరింత ఉత్కంఠభరితంగా మారాయి, అదనపు ఆటగాడికి ఆడే అవకాశం లభిస్తోంది. కోల్‌కతా లేదా ముంబై మినహా మిగతా చోట్ల పెద్దగా మార్పు లేదు. పంజాబ్ కింగ్స్ హోమ్ వేదికలో  మాత్రం అన్ని మ్యాచ్ లు 160-170 పరుగులకే పరిమితమయ్యాయి” అని అశ్విన్ గుర్తు చేశారు.

టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 యాక్టివ్ ప్లేయర్లు వీరే

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios