ధోని లేకుండానే యువరాజ్ సింగ్ బయోపిక్? ఎందుకు? ఇది సాధ్యమేనా?
Yuvraj Singh Biopic : క్రికెట్‌లో ఛాంపియన్ ప్లేయర్, టీమిండియా సక్సెస్ ఫుల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. భారత జట్టు లెజెండరీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ధోనికి గ్రౌండ్ లో మంచి స్నేహితుగా గుర్తింపు పొందారు. కానీ, ఈ ఇద్దరు స్టార్ల మధ్య విభేధాలు ఉన్నాయనే వార్తలతో 'యువరాజ్ సింగ్ బయోపిక్' వైరల్ గా మారింది.
Yuvraj Singh biopic without MS Dhoni? Why? Is it possible?
Yuvraj Singh Biopic : ప్రపంచ క్రికెట్ లో అత్యంత బలమైన టీమ్ గా ఉన్న రోజుల్లో కంగారూలను ఓడించడం దగ్గర్నుంచి చావును జయించడం వరకు భారత స్టార్ ఆల్ రౌండర్ యువరాజ్ ధైర్యసాహసాలు క్రికెట్ గ్రౌండ్ లోనే కాదు ప్రపంచ సమాజంలో జీవితాంతం గుర్తుండిపోయే ఆదర్శవంతమైన కథ. గ్రౌండ్ లో.. దాని వెలుపల యూవరాజ్ సింగ్ ఒక నిజమైన యోధుడు. 2007 టీ20 ప్రపంచ కప్, 2011 ప్రపంచ కప్ భారత విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
Yuvraj Singh biopic without MS Dhoni? Why? Is it possible?
జీవితంలో అద్భుతమైన క్షణాలు అందుకుంటున్న సమయంలో క్యాన్సర్ భూతంతో పోరాడాడు. యువరాజ్ సింగ్ తన దూకుడు, నిర్భయత, ఎప్పటికీ చావలేని వైఖరితో భారత క్రికెట్ లో.. ప్రపంచ వేదికపై ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడు. అందుకే ఈ భారత క్రికెట్ దిగ్గజం బయోపిక్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ టీ సిరీస్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి అధికారిక లాంఛనాలు పూర్తయ్యాయి.
Yuvraj Singh biopic without MS Dhoni? Why? Is it possible?
ఇదే సమయంలో యువరాజ్ బయోపిక్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదే యువరాజ్ బయోపిక్ లో లెజెండరీ బ్యాటర్ ఎంఎస్ ధోని కనిపిస్తారా? లేదా? అనేది. ఎందుకుంటే ధోని-యువరాజ్ లు క్రికెట్ గ్రౌండ్ లో మంచి స్నేహితులు. వీరిద్దరు కలిసి ఆడి భారత్ కు అనేక విజయాలు అందించారు. అయితే, వీరిద్దరి మధ్య విభేధాలు ఉన్నాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి. దీని గురించి ఇదివరకు పలుమార్లు వార్తలు కూడా వచ్చాయి. దీంతో ఇప్పుడు యువరాజ్ సింగ్ బయోపిక్ లో ఎంఎస్ ధోని కథ ఉంటుందా? లేదా? అనే చర్చ మొదలైంది.
Yuvraj Singh biopic without MS Dhoni? Why? Is it possible?
ధోనీ-యువరాజ్ చాలా సంవత్సరాలు కలిసి ఆడినప్పటికీ వారి మధ్య అంతా బాగా లేదని క్రికెట్ వర్గాల టాక్. యువరాజ్ తండ్రి యోగిరాజ్ సింగ్ స్వయంగా ధోనిని పలు సందర్భాల్లో క్రెడిట్ స్టీలర్ అంటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
Yuvraj Singh biopic without MS Dhoni? Why? Is it possible?
దీంతో యువరాజ్ బయోపిక్‌లో ధోని కథ నిజంగా ఉంటుందా? అనేది పెద్ద ప్రశ్న. అలాగే, ధోని లేకుండా యూవీ బయోపిక్ సాధ్యం కాదనేది నిజం. ఎందుకంటే ప్రపంచ కప్ ఫైనల్‌ను గెలవడం యువరాజ్ అత్యుత్తమ కెరీర్‌లో గొప్ప మైలురాయి. అద్భుతమైన ఇన్నింగ్స్ త భారత్ ను ఛాంపియన్ గా నిలబెట్టాడు. మరో విషయమేమిటంటే యూవీ నాన్ స్ట్రైకర్స్ ఎండ్‌లో ఉన్నప్పుడు ధోని ఆ మ్యాచ్ ను భారీ సిక్సర్ తో ముగించాడు.
Yuvraj Singh biopic without MS Dhoni? Why? Is it possible?
ఇది ఆచరణాత్మకంగా యువరాజ్ బయోపిక్ ముగింపు పాయింట్ అవుతుంది. అయితే వారిద్దరి మధ్య ఉన్న అండర్ కరెంట్ ను పరిశీలిస్తే అసలు ఇలా జరుగుతుందా? అనేది పెద్ద ప్రశ్న. ఏదేమైనా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదడంతో పాటు భారత్ కు ఎన్నో అద్భుత క్షణాలు అందించడం.. క్యాన్సర్ భూతాన్ని జయించిన యువరాజ్ సింగ్ బయోపిక్ ను వెండితెరపై చూడటం కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్నారు.