అశ్విన్‌ను ‘మాస్టర్‌’గా చూపిస్తూ పోస్టర్ డిజైన్ చేసిన ఫ్యాన్స్...నాలుగో రోజు ఫీల్డింగ్ చేస్తూ ‘వాతీ కమ్మింగ్’ పాట స్టెప్పులేసిన రవిచంద్రన్ అశ్విన్...సోషల్ మీడియా వైరల్ అయిన వీడియో...

ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో మ్యాచ్ విన్నింగ్ పర్ఫామెన్స్‌తో అదరగొట్టాడు ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్. మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్, బ్యాటింగ్‌లో అద్భుత సెంచరీతో చెలరేగాడు.

నాలుగో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు కూడా పడగొట్టి... ఒకే మ్యాచ్‌లో సెంచరీతో పాటు ఎనిమిది వికెట్లు తీసిన ఏకైక భారత ప్లేయర్‌గా తన రికార్డును తానే మెరుగుపరుచుకున్నాడు.
మ్యాచ్‌లో మూడో రోజు మొత్తం రవిచంద్రన్ అశ్విన్ డామినేషన్ కనిపించింది.

దీంతో కొందరు అభిమానులు, అశ్విన్‌గా ‘మాస్టర్’గా అభివర్ణిస్తూ పోస్టర్లు కూడా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ అభిమానికి ఉబ్బి తబ్బిబ్బయిన అశ్విన్, నాలుగోరోజు ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ‘మాస్టర్’ సినిమాలోని ‘వాతీ కమ్మింగ్’ స్టెప్పులు వేశాడు.

Scroll to load tweet…

చెన్నైకి చెందిన అశ్విన్, ఆసీస్ టూర్ తర్వాత ‘లెట్ మీ టెల్ యూ కుట్టీ స్టోరీ’ అంటూ వరుస ఇంటర్వ్యూలు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. వీటికి అద్భుతమైన స్పందన వచ్చింది.