కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ భారత్ లోనూ విలయతాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ నడుస్తోంది. ఈ కరోనా వైరస్ తో క్రీడా ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. ఎక్కడికక్కడ జరగాల్సిన అన్ని క్రీడలు ఆగిపోయాయి.

దీంతో క్రీడాకారులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లోనే కుటుంబసభ్యులతో గుడుపుతూ కాలక్షేపం చేస్తున్నారు. మరికొందరు ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న మొదట్లొ క్రీడాకారులంతా సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్ ఒకరిపై మరొకరు విసిరారు. ఇప్పుడేమో ఒకరితో మరొకరు సోషల్ మీడియాలో లైవ్ చాట్స్ ఇస్తున్నారు.

తాజాగా ఇండియన్ క్రికెటర్లు రవిచంద్రన్ అశ్విన్, హనుమ విహారి వీడియో కాల్‌లో కబుర్లు చెప్పుకున్నారు. ఇక్కడ విశేషమేంటంటే.. వీరిద్దరూ తెలుగులో మాట్లాడుకున్నారు. బాగున్నారా అంటూ పలకరించుకున్నారు. తెలుగు హీరోలు, సినిమాలు గురించి సరదాగా మాట్లాడుకున్నారు. ఒకరినొకరు ప్రశ్నలు అడుగుతూ, సమాధానమిస్తూ కాలక్షేపం చేశారు. ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అశ్విన్, హనుమ విహారి మధ్య సంభాషణ ఇలా జరిగింది...

అశ్విన్: ‘భీష్మ’ సినిమా హీరో ఎవరు?

హనుమ విహారి: నితిన్, గుడ్ మూవీ

హనుమ విహారి: మీకు ఏ మూవీ ఇష్టం

అశ్విన్: (రామ్ చరణ్) మగధీర, (అల్లు అర్జున్) అల వైకుంఠపురములో, (మహేశ్ బాబు) సరిలేరు నీకెవ్వరు.

కాగా.. వీరికి సంబంధించిన వీడియోని టాలీవుడ్ డైరెక్టర్  వెంకీ కుడుమల ట్విట్టర్ లో షేర్ చేశారు. బీష్మ సినిమాకి వెంకీ కుడుమల దర్శకత్వం వహించారు.