టీమిండియా చీఫ్ రవిశాస్త్రి మరోసారి నెటిజన్లకు అడ్డంగా బుక్కయ్యారు. ఆయన తాజాగా బౌలింగ్ చేస్తున్న కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కాగా... ఆ ఫోటోలను పట్టుకొని ఆయనను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

ప్రస్తుతం టీమిండియా బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ కోసం తలపడుతున్న సంగతి తెలిసిందే. కాగా...ఈ మ్యాచ్ నేపథ్యంలో ఎడమచేతితో స్పిన్ వేస్తుండగా తీసిన ఫోటోలను తన ట్విట్టర్ లో షేర్ చేశాడు.  సాధారణంగా నెట్స్ లో ఎప్పుడూ ఇండియన్ క్రికెటర్స్ కి సూచనలిస్తూ కనిపించే ఆయన తాజాగా బౌలింగ్ చేస్తూ కనిపించడం విశేషం.

దీనికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసి దానికి ‘ఓల్డ్ హ్యాబిట్స్, డై హార్డ్’ అనే క్యాప్షన్ ఇచ్చాడు. అంతే... ఆ ఫోటోలు ఇలా పెట్టగానే అలా వైరల్ అయ్యాయి. నెటిజన్లు ఆయనపై జోకులు వేస్తూ ట్రోల్ చేస్తున్నారు. గంగూలీకి రవిశాస్త్రి భయపడ్డాడని కొందరు ట్వీట్లు చేయడం గమనార్హం.

బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ ఎంపికైన తర్వాత వచ్చిన ప్రధాన మార్పు ఏమైనా ఉంటే ఇదే.. ఎప్పుడూ చేతిలో అల్కాహల్‌ బాటిల్‌తో కనిపించే రవిశాస్త్రి సూప్ తాగుతున్నాడు" అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా.... మరొక నెటిజన్ "ఓల్డ్‌ హాబిట్స్‌ డై హార్డ్‌ ఏమీ కాదు, గంగూలీని చూసి భయపడుతున్నావ్‌. అందుకే ఎప్పుడూ బద్ధంగా ఉండే నువ్వు బౌలింగ్‌ చేస్తున్నావ్‌" అని ఎద్దేవా చేశాడు.