Asianet News TeluguAsianet News Telugu

రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డు.. 24 ఏండ్లకే 500 వికెట్లు.. కేప్‌టౌన్ కెప్టెన్ కేక..

Rashid Khan: టీ20 క్రికెట్ లో అఫ్గానిస్తాన్ క్రికెటర్ రషీద్ ఖాన్  ప్రపంచ రికార్డు సృష్టించాడు.  అతి పిన్న వయసులోనే పొట్టి ఫార్మాట్ లో  500 వికెట్లు  పూర్తి చేసుకున్న తొలి బౌలర్ గా రికార్డులకెక్కాడు. 

Rashid Khan creates history in SA T20 league, Completes 500 Wickets MSV
Author
First Published Jan 24, 2023, 2:51 PM IST

అఫ్గాన్ సంచలనం రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.  టీ20 క్రికెట్ లో   500 వికెట్లు తీసిన అతి పిన్న వయస్కుడిగా, ఈ ఫీట్  సాధించిన రెండో క్రికెటర్ గా   రికార్డు పుటల్లోకెక్కాడు.  టీ20 క్రికెట్ లో 500 వికెట్లు సాధించిన వారిలో ఇంతమకుందు  వెస్టిండీస్ క్రికెటర్  డ్వేన్ బ్రావో మాత్రమే ముందున్నాడు.  కానీ  24 ఏండ్ల  వయసులోనే ఈ ఘనత సాధించిన తొలి బౌలర్ గా రషీద్ ఖాన్ రికార్డులకెక్కాడు. 

దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఎస్ఎ 20 లీగ్ లో భాగంగా  సోమవారం ఎంఐ కేప్‌టౌన్ వర్సెస్ ప్రిటోరియా క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో  సిడిల్ ఫార్ట్యూన్ వికెట్ తీయడం ద్వారా  రషీద్ ఈ ఘనత అందుకున్నాడు.  ఈ మ్యాచ్ లో  రషీద్.. 16 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. 

టీ20 క్రికెట్ లో అత్యధిక వికెట్ల వీరులు : 

- డ్వేన్ బ్రావో - 614 వికెట్లు (526 ఇన్నింగ్స్)
- రషీద్ ఖాన్ - 500 (368 ఇన్నింగ్స్)
- సునీల్ నరైన్ - 474 (427 ఇన్నింగ్స్) 
- ఇమ్రాన్ తాహీర్ - 466 (358 ఇన్నింగ్స్) 
- షకిబ్ అల్ హసన్ - 436 (382 ఇన్నింగ్స్) 
- వహబ్ రియాజ్ -  401 వికెట్లు (335 ఇన్నింగ్స్) 

 

ప్రపంచంలో ఎక్కడ క్రికెట్ లీగ్ ఆడినా  అందులో రషీద్ ఖాన్ తప్పకుండా ఉంటాడు.  పిన్న వయస్సులోనే  ఐపీఎల్ లో మెరిసి ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ లో కీలక ఆటగాడిగా మారిన రషీద్ ఖాన్.. ఐపీఎల్ తో  పాటు పీఎస్ఎల్ (పాకిస్తాన్), బీబీఎల్ (ఆస్ట్రేలియా), ఎస్ఎ20 (దక్షిణాఫ్రికా) వంటి లీగ్ లలో  తన  స్పిన్ మాయతో   దిగ్గజ బ్యాటర్లను సైతం బోల్తా కొట్టిస్తున్నాడు. ఎంఐ కేప్‌టౌన్ ను  అతడే సారథి.

 

తన దేశం తరఫున  రషీద్..  74 టీ20లు ఆడి  122 వికెట్లు తీశాడు.  మిగతావి వివిధ లీగ్ (ఐపీఎల్ లో 92 మ్యాచ్ లలో 112 వికెట్లు) లలో తీసిన వికెట్లు కావడం విశేషం. 

Follow Us:
Download App:
  • android
  • ios