రాంచి: రాంచి టెస్టులో రోహిత్ శర్మ ఇప్పుడే డబల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 199 పరుగుల వద్ద సిక్స్ కొట్టి డబల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రాంచి టెస్టులో ఆకాశమే హద్దుగా రెచ్చిపోతున్నాడు. పట్టపగలే సఫారీ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. పరిస్థితులకు అనుగుణంగా గేయార్లు మారుస్తూ, చెలరేగిపోతున్నారు. టెస్టు మ్యాచులో 82 సగటు మైంటైన్ చేస్తూ, టెస్టు ను కాస్తా వన్డే మాదిరిగా మార్చి బౌలర్లను ఒక ఆట ఆడుకుంటున్నాడు. 

దీపావళి పండుగకు ఇంకో వారం రోజుల సమయమున్న రాంచీలో స్టేడియం లో ఉన్న వారికి మాత్రం వారం ముందుగానే వచ్చింది. హిట్ మ్యాన్ హిట్టింగ్ తో అక్కడ సిక్సర్ల మోత మోగుతోంది. 199 పరుగుల వద్ద సిక్స్ కొట్టడంతో అభిమానులు ఒక్కసారిగా అరుపులు కేకలతో స్టేడియం హోరెత్తించారు. 

రాంచి టెస్ట్: కొత్త తండ్రి రహానే కూడా సెంచరీ బాదేశాడు, రోహిత్ 150

నిన్నటి నుంచి జోరు మీదున్న హిట్ మ్యాన్ ఈ రోజు ఆ జోరును మరింత పెంచాడు. టాప్ గేర్లో దూసుకుపోతున్నాడు. ఇందాకే రహానే ఔటయ్యాడు.   అజింక్య రహానే 115 పరుగుల వద్ద జార్జ్ లిండే బౌలింగ్ లో క్లాస్సేన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రవీంద్రజడేజా(15),రోహిత్ శర్మ(205) క్రీజులో ఉన్నారు. 

నిన్నటి ఓవర్ నైట్ స్కోర్ 224/3 వద్ద ఆట ఆరంభించిన భారత్, చాల కాన్ఫిడెంట్ గా కనపడుతుంది. రోహిత్ శర్మ, బ్యాటును ఝుళిపిస్తున్నాడు.  గ్రౌండ్ లో నిన్నటిలానే పరుగుల వరద పారడం తథ్యంగా కనపడుతుంది. రోహిత్ డబల్ సెంచరీ దిశగా దూసుకుపోతున్నాడు. 

నిన్న వెలుతురు సరిగా లేని కారణంగా తొలుత బ్రేక్ ఇచ్చినప్పటికీ, తరువాత వర్షం కారణంగా మ్యాచును ఆపేసారు. ఇప్పటికే రోహిత్ శర్మ సెంచరీ చేసాడు. 130 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసాడు. టెస్టు మ్యాచులో పరుగుల వరదపారిస్తున్నాడు. 4 సిక్సర్లు,13 ఫోరులు బాదాడు. తన టెస్టు కెరీర్లో ఆరో సెంచరీని నమోదు చేసాడు. ఈ సిరీస్ లో ఇప్పటికే రెండు సెంచరీలు బాదాడు. ఇది మూడో సెంచరీ.

రో"హిట్": కొత్త ప్రపంచ రికార్డు, గవాస్కర్ కు సరిజోడు, భజ్జీ రికార్డు బ్రేక్

హిట్ మాన్ షో కంటిన్యూ అవుతుంది. ఇటుపక్క నుంచి రోహిత్ అటుపక్క నుంచి రహానే ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును ఉరకలెత్తిస్తున్నారు. ప్రస్తుతానికి భారత్ 4 వికెట్లు కోల్పోయి 369 పరుగులు చేసింది. 

నిన్నటి ఓవర్ నైట్ స్కోర్ 224/3 వద్ద ఆట ఆరంభించిన భారత్, చాల కాన్ఫిడెంట్ గా కనపడుతుంది. రోహిత్ శర్మ,గ్రౌండ్ లో హుల్ చల్ చేస్తున్నాడు. అభిమానులకు దీపావళి పండుగను ముందుగానే తీసుకొచ్చాడు.  

ఒక టెస్టు సిరీస్లో భారత బ్యాట్స్‌మెన్లు ఇలా మూడు డబుల్ సెంచరీలు బాదడం 64 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 1955-56లో కివీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియా మాజీ క్రికెటర్లు వినూ మన్కడ్ రెండు, పాలీ ఉమ్రిగర్ ఒక డబుల్ సెంచరీ సాధించారు.

తాజాగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో విశాఖలో జరిగిన తొలి టెస్టులో ఓపెనర్ మయాంక్ అగర్వాల్, పుణేలో విరాట్ కోహ్లీ, రాంచీలో రోహిత్ శర్మ డబుల్ సెంచరీ చేసి నాటి రికార్డును సమం చేశారు.