రాంచి: రాంచి టెస్టులో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 306 పరుగుల వద్ద రహానే ఫుట్ అయ్యాడు. అజింక్య రహానే 115 పరుగుల వద్ద జార్జ్ లిండే బౌలింగ్ లో క్లాస్సేన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఓవర్ కాన్ఫిడెన్స్ తో షాట్ సెలక్షన్ తప్పుగా చేసాడు. క్రీజ్  బయటకొచ్చి ఆడాల్సిన బంతికి క్రీజ్ లోపల ఉంది చాల సేపు ఆగి దాన్ని ఆడాడు. దీనివల్ల అతడు తగిన మూల్యం చెల్లించుకున్నాడు. 

రాంచి టెస్టులో ఇందాకే శతకం పూర్తి చేసుకున్నాడు. రోహిత్ ఇప్పటికే సెంచరీ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. రోహిత్ సెంచరీ పూర్తి చేసే సమయానికి రహానే కూడా అర్థ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు.

నిన్నటి ఓవర్ నైట్ స్కోర్ 224/3 వద్ద ఆట ఆరంభించిన భారత్, చాల కాన్ఫిడెంట్ గా కనపడుతుంది. రోహిత్ శర్మ, బ్యాటును ఝుళిపిస్తున్నాడు.  గ్రౌండ్ లో నిన్నటిలానే పరుగుల వరద పారడం తథ్యంగా కనపడుతుంది. రోహిత్ డబల్ సెంచరీ దిశగా దూసుకుపోతున్నాడు. 

నిన్న వెలుతురు సరిగా లేని కారణంగా తొలుత బ్రేక్ ఇచ్చినప్పటికీ, తరువాత వర్షం కారణంగా మ్యాచును ఆపేసారు. ఇప్పటికే రోహిత్ శర్మ సెంచరీ చేసాడు. 130 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసాడు. టెస్టు మ్యాచులో పరుగుల వరదపారిస్తున్నాడు. 4 సిక్సర్లు,13 ఫోరులు బాదాడు. తన టెస్టు కెరీర్లో ఆరో సెంచరీని నమోదు చేసాడు. ఈ సిరీస్ లో ఇప్పటికే రెండు సెంచరీలు బాదాడు. ఇది మూడో సెంచరీ.

హిట్ మాన్ షో కంటిన్యూ అవుతుంది. ఇటుపక్క నుంచి రోహిత్ అటుపక్క నుంచి రహానే ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును ఉరకలెత్తిస్తున్నారు. ప్రస్తుతానికి భారత్ 4 వికెట్లు కోల్పోయి 322 పరుగులు చేసింది. రోహిత్ 179, రవీంద్ర జడేజా 3 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. 

 భారత్‌ జట్టు 39 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కోహ్లీ 12 పరుగులవద్ద లెగ్ బిఫోర్ గా వెనుదిరిగాడు. అంతకుముందు మయాంక్‌ అగర్వాల్‌(10), చతేశ్వర్‌ పుజరా(0)లు నిరాశపరిచారు. వీరిద్దరూ రబడా బౌలింగ్‌లో ఔటయ్యారు.  ప్రతిసారి క్రీజులో పాతుకుపోయి పుజారా ఇలా డక్ అవుట్ అవడంతో అభిమానులు ఉసూరుమన్నారు.