Asianet News TeluguAsianet News Telugu

టెస్టు క్రికెట్ ను నాశనం చేయడానికేనా ఈ పిచ్‌లు.. ఓటమి అంటే అంత భయమెందుకు..? రమీజ్ రాజాపై పాక్ ఫ్యాన్స్ ఆగ్రహం

PAKvsENG: 17 ఏండ్ల తర్వాత పాకిస్తాన్ గడ్డమీద టెస్టు సిరీస్ ఆడేందుకు వచ్చిన ఇంగ్లాండ్.. రావల్పిండి టెస్టులో పరుగుల వరద పారిస్తున్నది. వచ్చిన బ్యాటర్ వచ్చినట్టు ఆకాశమే హద్దుగా రెచ్చిపోతున్నాడు. 

Ramiz Raja Trying Test Cricket: Pakistan Fans Slams PCB Chief After England Playing Aggressively in Rawalpindi Test
Author
First Published Dec 1, 2022, 5:20 PM IST

రావల్పిండి వేదికగా  పాకిస్తాన్ - ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొల టెస్టులో పరుగుల వరద పారుతున్నది. ఇంగ్లీష్ బ్యాటర్లు ఆడుతున్నది టెస్టు అనే సంగతి మరిచిపోయి టీ20 కంటే దారుణంగా బాదుతున్నారు. టాప్ -5 బ్యాటర్లలో నలుగురు సెంచరీలు చేశారు. వచ్చినోళ్లు వచ్చినట్టు వీరవిహారం చేస్తూ పాకిస్తాన్ బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపెడుతున్నారు. బౌలర్లను, ఫీల్డర్లను మార్చినా ఫలితం  మాత్రం సేమ్.  బౌలర్ బంతి విసరడం, బంతి బౌండరీ లైన్ దాటడం.. ఇదే సీన్ రిపీట్.  నిస్సారమైన పిచ్ పై ఇంగ్లాండ్ బ్యాటర్లు పండుగ చేసుకోవడం జీర్ణించుకోలేని పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ ఆ దేశ క్రికెట్ బోర్డు చీఫ్ రమీజ్ రాజాపై దుమ్మెత్తి పోస్తున్నారు. 

పాక్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ కు దిగింది. ఆ జట్టులో ఓపెనర్లు జాక్ క్రాలే (111 బంతుల్లో 122, 21 ఫోర్లు), బెన్ డకెట్ (110 బంతుల్లో 107, 15 ఫోర్లు), ఓలీ పోప్ (104 బంతుల్లో 108, 14 ఫోర్లు) సెంచరీల మోత మోగించారు.  జో రూట్ (23) ఒక్కడు విఫలమైనా తర్వాత హ్యారీ బ్రూక్ (80 బంతుల్లో 101 నాటౌట్, 14 ఫోర్లు, 2 సిక్సర్లు) లు వీరవిహారం చేశారు. 

పాకిస్తాన్  యువ పేసర్ నసీమ్ షా, వెటరన్ హరీస్ రౌఫ్ లతో పాటు మహ్మద్ అలీ, జహీద్ మహ్మద్, అగ సల్మాన్ లు వికెట్ల కోసం పడరాని పాట్లు పడుతున్నారు.  అయితే సారం లేని పిచ్ ను తయారుచేయించారని నెటిజన్లు  రమీజ్ రాజాపై  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఇంగ్లీష్ బ్యాటర్లు పండుగ చేసుకుంటున్న తరుణంలో ట్విటర్ వేదికగా పలువురు  పాకిస్తాన్ ఫ్యాన్స్.. ‘రమీజ్ రాజా టెస్టు క్రికెట్ ను సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు. కామెంటేటర్ గా ఉన్నప్పుడు ఆయన ఎప్పుడూ పాకిస్తాన్ జట్టు మరీ  నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తుందని కామెంట్స్ చేసేవాడు. ఇప్పుడు పీసీబీ చీఫ్ అయ్యాక ప్రత్యర్థి జట్టు ఒకరోజులో 500 పరుగులు చేసేవిధంగా పిచ్ లు తయారుచేస్తున్నాడు..’ అని  కామెంట్స్ చేస్తున్నారు. 

 

 

ప్రముఖ మాజీ క్రికెటర్ టామ్ మూడీ స్పందిస్తూ.. ‘పాకిస్తాన్ - ఇంగ్లాండ్ ల మధ్య రావల్పిండి వేదికగా జరుగుతున్న వన్డే సిరీస్ అద్భుతంగా ఉంది..’ అని సెటైర్ వేశాడు.  ‘నా దారి రహాదారి.. రమీజ్ రాజా’, ‘ఇదేం పిచ్ రా అయ్యా.. మరీ ఇంత అధ్వాన్నంగా ఉంది. బ్యాటర్లు పండుగ  చేసుకోవడానికే దీనిని రూపొందించారా..?’, ‘అసలు ఏ దేశ క్రికెట్ అభిమాని కూడా  ఇంత దరిద్రమైన పిచ్ ను చూడాలనుకోడు. థ్యాంక్యూ రమీజ్ రాజా. టెస్టు క్రికెట్ ను  నాశనం చేయాలన్న నీ  ఆశయం  నెరవేరుతున్నది..’, ‘ఓటమంటే అంత భయమా రమీజ్.. ఇంత నిస్సారమైన పిచ్ లు తయారుచేసి అబాసుపాలవ్వడం కంటే  ఓడిపోవడమే బెటర్ కదా..’ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios