రాజస్థాన్ రాయల్స్‌తో తరుపున ఎంట్రీ ఇచ్చి, మొదటి సీజన్‌లోనే చక్కని ప్రదర్శనతో ఆకట్టుకున్న యువ బౌలర్ చేతన్ సకారియా ఇంట్లో విషాదం నెలకొంది. కరోనా బారిన పడిన ఆయన తండ్రి కంజిభాయ్... తుదిశ్వాస విడిచారు.

రెండు రోజుల క్రిందటే ఐపీఎల్ 2021 డబ్బులు వచ్చాయని, వాటితో తన తండ్రికి చికిత్స చేయిస్తున్నానని సంతోషం వ్యక్తం చేశాడు చేతన్ సకారియా. అయితే అంతలోనే తండ్రి మరణవార్త తెలిసింది. గుజరాత్‌ రాష్ట్రానికి చెందిన కంజిభాయ్ కొన్నాళ్లుగా డయాబెటిక్ సమస్యతో బాధపడుతున్నాడు.

టెంపో నడిపి ఇద్దరు కొడుకులను చదివించాడు కంజిభాయ్. అయితే జనవరిలో చేతన్ సకారియా తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విషాదం నుంచి కుటుంబం ఇంకా పూర్తిగా కోలుకోకముందే కరోనా మహమ్మారి మరో ప్రాణాన్ని బలితీసుకుంది.