జోస్ బట్లర్ స్థానంలో న్యూజిలాండ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌ గ్లెన్ ఫిలిప్స్‌... ఆస్ట్రేలియా క్రికెటర్ ఆండ్రూ టై స్థానంలో టీ20 నెం.1 బౌలర్, సౌతాఫ్రికా సెన్సేషనల్ స్పిన్నర్ తబ్రేజ్ షంసీ...

ఐపీఎల్ 2021 సీజన్‌ ఫేజ్ 2లో స్టార్ ప్లేయర్లను కోల్పోయింది రాజస్థాన్ రాయల్స్. స్టార్ ఆల్‌రౌండర్ జోఫ్రా ఆర్చర్ గాయంతో క్రికెట్‌కి దూరం కాగా... బెన్ స్టోక్స్ మెంటల్ హెల్త్ కోసం క్రికెట్‌కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.

ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ కూడా వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్‌కి దూరం కావడంతో ఏకంగా ముగ్గురు మ్యాచ్ విన్నర్లను కోల్పోయింది రాజస్థాన్ రాయల్స్...జోస్ బట్లర్ స్థానంలో న్యూజిలాండ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌ గ్లెన్ ఫిలిప్స్‌ తీసుకున్న రాజస్థాన్ రాయల్స్... ఆస్ట్రేలియా క్రికెటర్ ఆండ్రూ టై స్థానంలో టీ20 నెం.1 బౌలర్, సౌతాఫ్రికా సెన్సేషనల్ స్పిన్నర్ తబ్రేజ్ షంసీని తీసుకుంది.

Scroll to load tweet…


2016-18 సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడిన తబ్రేజ్ షంసీ... 2016 సీజన్‌లో నాలుగు మ్యాచులు ఆడి 3 వికెట్లు తీసి తీవ్రంగా నిరాశపరిచాడు... అయితే ప్రస్తుతం తబ్రేజ్ షంసీ, టీ20ల్లో అదిరిపోయే పర్ఫామెన్స్‌ ఇస్తూ... ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నెం.1 బౌలర్‌గా ఎదిగాడు. 39 టీ20 మ్యాచుల్లో 45 వికెట్లు తీసిన షంసీకి కరేబియన్ ప్రీమియర్ లీగ్‌ వంటి టీ20 లీగుల్లో మంచి రికార్డు కూడా ఉంది.

షంసీ ఎంట్రీతో రాజస్థాన్ రాయల్స్ స్పిన్ విభాగం కూడా పటిష్టంగా తయారవుతుందని భావిస్తోంది టీమ్ మేనేజ్‌మెంట్. ఐపీఎల్ 2021 సీజన్ ఫేజ్ 1లో జరిగిన ఏడు మ్యాచుల్లో రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్లు కేవలం మూడు వికెట్లు మాత్రమే తీయగలిగారు...