యావత్ భారతాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా నియంత్రణ కోసం ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాజస్థాన్ రాయల్స్ భారీ సాయం ప్రకటించంది. కరోనా బాధితుల కోసం ఏకంగా ఒక మిలియన్ డాలర్లను (దాదాపు 7.5 కోట్ల రూపాయలు) విరాళంగా ఇస్తున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది రాజస్థాన్ రాయల్స్.

రాజస్థాన్ రాయల్స్ జట్టు యజమానులతో పాటు ఆటగాళ్లు, మేనేజ్‌మెంట్ కలిసి కరోనా నియంత్రణ చర్యల్లో ప్రభుత్వానికి మద్ధతుగా నిలిచేందుకు ఈ సాయం చేస్తున్నట్టు ప్రకటించారు.

బయట పెద్దగా ఫ్యాన్ బేస్ లేకపోయినా సోషల్ మీడియాలో రాజస్థాన్ రాయల్స్‌కి భారీ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఆర్ఆర్ అడ్మిన్, క్రియేటివిటీకి హాస్యాన్ని జోడించి పెట్టే పోస్టులకు మంచి పాపులారిటీ దక్కింది. ఇప్పుడు ఈ సాయంతో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై కూడా చాలామందికి గౌరవం ఏర్పడింది.