11 బంతుల్లో హాఫ్ సెంచరీ! యువీ రికార్డు బ్రేక్ చేసిన రైల్వేస్ ఆటగాడు అషుతోష్ శర్మ...
12 బంతుల్లో ఓ ఫోర్, 8 సిక్సర్లతో 53 పరుగులు చేసిన ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిన అషుతోష్ శర్మ... 4 ఓవర్లలో 96 పరుగుల భాగస్వామ్యం..
16 ఏళ్లుగా బద్ధలు కాని యువరాజ్ సింగ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు, 2023లో రెండోసారి బ్రేక్ అయ్యింది. ఏషియన్ గేమ్స్ 2023 పోటీల్లో నేపాల్ ఆటగాడు దీపేంద్ర సింగ్ ఆరీ 9 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేయగా, తాజాగా రైల్వేస్ ఆటగాడు అషుతోష్ శర్మ 11 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదాడు..
సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో భాగంగా రైల్వేస్, అరుణాచల్ ప్రదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 8 సిక్సర్లతో ఈ రికార్డు ఫీట్ బాదాడు అషుతోష్ శర్మ. తొలుత బ్యాటింగ్ చేసిన రైల్వేస్ జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 246 పరుగుల భారీ స్కోరు చేసింది..
శివమ్ చౌదరి 11, ప్రథమ్ సింగ్ 24, వివేక్ సింగ్ 18, సౌరబ్ చైబే 24 పరుగులు చేసి అవుట్ అయ్యారు. 15 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 131 పరుగులే చేసింది రైల్వేస్ జట్టు. అయితే సెంచరీ హీరో ఉపేంద్ర యాదవ్, అషుతోష్ శర్మ కలిసి నాలుగు ఓవర్లలో 96 పరుగులు రాబట్టారు..
12 బంతుల్లో ఓ ఫోర్, 8 సిక్సర్లతో 53 పరుగులు చేసిన ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిన అషుతోష్ శర్మ, 19వ ఓవర్ ఆఖరి బంతికి అవుట్ అయ్యాడు. 51 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 103 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు...
247 పరుగుల భారీ లక్ష్యఛేదనలో అరుణాచల్ ప్రదేశ్, 18.1 ఓవర్లలో 119 పరుగులకి ఆలౌట్ అయ్యింది. రైల్వేస్ జట్టుకి 127 పరుగుల తేడాతో భారీ విజయం దక్కింది. కుమార్ నోపు 15, తెచి దొరియా 6, ఆయుష్ అవాస్తీ 36, దివ్యాంశు యాదవ్ 29, నీలం ఓబీ 11 పరుగులు చేశారు. రైల్వేస్ బౌలర్ సుశీల్ కుమార్ 3 ఓవర్లలో 17 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు.