Asianet News TeluguAsianet News Telugu

టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్రావిడ్... అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ తర్వాత భారత జట్టు ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రావిడ్... సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన బీసీసీఐ...

Rahul Dravid appointed as Team India's Next head Coach, BCCI officially announced
Author
India, First Published Nov 3, 2021, 9:01 PM IST

టీ20 వరల్డ్‌కప్‌ 2021  టోర్నీ తర్వాత భారత జట్టు ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నాడు. ఈ విషయాన్ని అధికారికంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది బీసీసీఐ... ఎన్‌సీఏ హెడ్ పదవికి రాజీనామా సమర్పించిన రాహుల్ ద్రావిడ్, టీమిండియా హెడ్‌కోచ్ పదవికి వారం రోజుల క్రితమే అధికారికంగా దరఖాస్తు సమర్పించాడు... ఈ నెల 17 నుంచి మొదలయ్యే న్యూజిలాండ్, ఇండియా సిరీస్ నుంచి భారత ప్రధాన కోచ్‌గా బాధ్యతలు తీసుకోబోతున్నారు రాహుల్ ద్రావిడ్. అక్టోబర్ 26న రవిశాస్త్రి కాంట్రాక్ట్ గడువు ముగిసింది. అయితే టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ముగిసిన తర్వాత రవిశాస్త్రి, ఆ పదవి నుంచి తప్పుకోనున్నారు. 

Read this: మీరు ఎలా ఉంటే మాకెందుకు, సరిగా ఆడి చావండి... టీమిండియా పర్ఫామెన్స్ మాజీ కెప్టెన్ ఘాటు వ్యాఖ్యలు...

‘భారత జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకోవడం గర్వంగా భావిస్తున్నా. రవిశాస్త్రి చాలా బాగా తన బాధ్యతను నిర్వర్తించి, టీమిండియాను సూపర్ పవర్‌గా మార్చారు. ఆయన తీసుకెళ్లిన స్టాండర్స్‌ను మెయింటైన్ చేయడానికి నేను నా వంతు ప్రయత్నం చేస్తాను... ఎన్‌సీఏలో, అండర్‌19, ఇండియా జట్టు కోచ్‌గా పనిచేసిన సమయంలో ఉన్న ప్లేయర్లే ఇప్పుడు టీమిండియాలో ఉండడం నాకు కలిసొస్తుందని అనుకుంటున్నా. వచ్చే రెండేళ్లలో కలిసి టీమిండియాతో కలిసి పనిచేయడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నా...’ అంటూ కామెంట్ చేశారు రాహుల్ ద్రావిడ్... 

 

2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో పాకిస్తాన్ చేతుల్లో టీమిండియా ఓటమి తర్వాత హెడ్‌కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న రవిశాస్త్రి, టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో పాక్ చేతుల్లో భారత జట్టు ఓటమి తర్వాత ఆ పదవి నుంచి తప్పుకోబోతుండడం విశేషం. ఇంతకుముందెన్నడూ లేని విధంగా రవిశాస్త్రి కోచ్‌గా ఉన్న సమయంలో టెస్టుల్లో 36 పరుగులకే ఆలౌట్ అయిన భారత జట్టు, ఐసీసీ వరల్డ్‌కప్ టోర్నీపై పాక్‌పై ఉన్న అన్‌బీటెన్ రికార్డును కూడా కోల్పోవాల్సి వచ్చింది...

బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ పదవీకాలం కూడా ముగియనుంది. రాహుల్ ద్రావిడ్ సన్నిహితుడు, ఎన్‌సీఏ (జాతీయ క్రికెట్ అసోసియేషన్)లో బౌలింగ్ కన్సల్టెంట్‌గా వ్యవహరించిన పరాస్ మాంబ్రే, బౌలింగ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నాడు...

అలాగే ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ కూడా మళ్లీ బాధ్యతలు చేపట్టడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఫీల్డింగ్ కోచ్ పదవికి భారత మాజీ క్రికెటర్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ అజయ్ రత్రా దరఖాస్తు సమర్పించాడు. హర్యానాకి చెందిన అజయ్ రత్రా, టీమిండియా తరుపున 6 టెస్టులు, 12 వన్డేలు ఆడాడు. ఇందులో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 115 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి ఆకట్టుకున్నాడు. 

అతిపెద్ద వయసులో టెస్టుల్లో సెంచరీ చేసిన వికెట్ కీపర్‌గా, విదేశాల్లో సెంచరీ చేసిన తొలి భారత వికెట్ కీపర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు అజయ్. అయితే కొన్నాళ్లకే గాయం కారణంగా జట్టుకి దూరం కావడంతో అతని స్థానంలో పార్థివ్ పటేల్, టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు...

99 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన అజయ్ రత్రా, 8 సెంచరీలు, ఓ డబుల్ సెంచరీతో కలిపి 4029 పరుగులు చేశాడు. 2015లో క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన అజయ్, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 233 క్యాచులు అందుకున్నాడు. హెడ్ కోచ్ నియామకం గురించి క్లారిటీ వచ్చినా, మిగిలిన పొజిషన్లకి గురించి ఇంకా క్లారిటీ ఇవ్వలేదు బీసీసీఐ...
 

Follow Us:
Download App:
  • android
  • ios