వివాదాస్పద స్వామిజీ నిత్యానంద నిత్యం ఏదో ఒక వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఆయనపై అత్యాచార కేసులు కూడా ఉన్నాయి. కాగా.. తాజాగా ఆయన తానొక ద్వీపాన్ని కొనుగోలు చేశానని... దానికి దేశంగా గుర్తింపు ఇవ్వాలని ప్రపంచ దేశాలని కోరిన సంగతి తెలిసిందే. అయితే... ఆ దేశానికి వెళ్లడానికి వీసా వస్తుందో రాదోనని.. టీమిండియా స్పిన్నర్ అశ్విన్ లో కంగారు మొదలైందట. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్ కి నెటిజన్ల నుంచి క్రేజీ స్పందన వస్తోంది.

ఇంతకీ మ్యాటరేంటంటే.... నిత్యానంద స్వామిజీ కొంత కాలం క్రితం ట్రినిడాడ్ అనే దేశానికి వెళ్లారు. అక్కడ ఆయన ఓ ద్వీపాన్ని కొనుగోలు చేశారు. దానికి కైలాసం అని పేరు కూడా పెట్టారు. అయితే... తన ద్వీపాన్ని కూడా ఓ దేశంగా గుర్తించండి అంటూ తాజాగా ప్రపంచ దేశాలను కోరారు.

 

ఆయన దేశం కాన్సెప్ట్ ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. కాగా... దీనిపై స్పిన్నర్ అశ్విన్ ఓ సరదా ట్వీట్ చేశారు. ‘ నిత్యానందుల వారు కైలాసం పేరుతో కొత్త దేశాన్ని నెలకొల్పారట. మరి వీసా వస్తుందంటారా’ అంటూ ట్వీట్ చేశాడు. కాగా... ఆ ట్వీట్ కి నెటిజన్లు తెగ స్పందిస్తున్నారు. అశ్విన్ లో కామెడీ యాంగిల్ కి నెటిజన్ల పొట్టలు చెక్కలౌతున్నాయి. ఇప్పుడు ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. ‘జోకులు చాలు.. ఇంక మా వల్ల కాదు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.