సన్‌రైజర్స్ చెత్త ప్రదర్శన .. కావ్యను అలా చూడలేకపోతున్నా, మంచి ఆటగాళ్లను పెట్టండి : దయానిధికి రజనీ విజ్ఞప్తి
సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని దయానిథి మారన్‌కు తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ కీలక సూచనలు చేశారు. ఈసారైన జట్టులో మంచి ఆటగాళ్లను పెట్టాలని.. టీమ్ ఓడిపోయినప్పుడల్లా కావ్య మారన్‌ను అలా విచారంగా చూడలేకపోతున్నానని రజనీ అన్నారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ప్రముఖ జట్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) ఒకటి. అయితే గడిచిన కొన్ని సీజన్ల నుంచి ఈ టీమ్ సరైన ప్రదర్శన ఇవ్వకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఈ ఏడాది ముగిసిన ఐపీఎల్‌లో 14 మ్యాచ్‌లకు గాను కేవలం 4 విజయాలతో సన్‌రైజర్స్ అట్టడుగున నిలిచింది. ఈ ఏడాది ఐడెన్ మార్క్రామ్ నేతృత్వంలో ఎస్ఆర్‌హెచ్ బరిలోకి దిగింది. కానీ ఏ ఒక్కసారి ఇతర జట్లకు పోటీనిచ్చే స్థాయిలో ఆడలేదు. పేరుకు జట్టులో స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ, వారు తమ స్థాయికి దగ్గ ప్రదర్శన ఇవ్వలేదు. డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్‌ను తొలగించడంతో పాటు జానీ బెయిర్‌స్టో, రషీద్ ఖాన్‌లను సన్‌రైజర్స్ నిలబెట్టుకోలేకపోవడం జట్టును తీవ్రంగా దెబ్బతీసిందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.
అస్థిరత కారణంగానే జట్టు అట్టడుగు స్థానంలో నిలవాల్సి వచ్చిందని వారు చెబుతున్నారు. ఫ్రాంచైజీ యజమాని కళానిధి మారన్ కుమార్తె, సీఈవో కావ్య మారన్ కింద ఎస్ఆర్‌హెచ్ సరిగా పనిచేయలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వేలం సందర్భంగా ఆమె తీసుకున్న నిర్ణయాలు బెడిసికొట్టాయని అంటున్నారు. టోర్నీ జరిగినంత సేపు సన్‌రైజర్స్ హోమ్ గ్రాండ్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలోని వీఐపీ బాక్స్‌లో కావ్య నిరాశగా వుంటూ కనిపిస్తూనే వున్నారు. ఆమెను అలా చూడటాన్ని అభిమానులు కూడా అలవాటు చేసుకున్నారు.
ఈ క్రమంలో కావ్య కలతతో వుండటం, విచారకరమైన వ్యక్తీకరణను చూసిన తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ తట్టుకోలేకపోయారు. ఈ విషయాన్ని దాచుకోలేక ఆయన బయటకు చెప్పేశారు. తన తాజా చిత్రం ‘‘జైలర్’’ ఆడియో లాంచ్‌లో తలైవా మాట్లాడుతూ.. కావ్యను అలా చూడలేకపోతున్నానని అన్నారు. జట్టులో మంచి ఆటగాళ్లను పెట్టాల్సిందిగా సన్‌రైజర్స్ యజమాని, చిత్ర నిర్మాత కళానిధి మారన్‌ను రజనీ కోరారు. అయితే కళానిధి మారన్‌కు రజనీకాంత్ చేసిన విజ్ఞప్తి ఇప్పుడు ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. అతని అభిమానులు కూడా దీనికి మద్ధతుగా కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి కావ్యను అలా దీనంగా చూడటం మాకు కూడా కష్టంగా వుందని వారు పోస్టులు పెడుతున్నారు.