ఏదో షూట్ లో భాగంగా ఆయన తన తలకు తలపాగా చుట్టినట్లు అర్థమౌతోంది. దానిని ఆయన తన స్టేటస్ లో పేర్కొనడం గమనార్హం. రేపటి షో కోసం చాలా ఆతురతగా ఉందని.. దాని కోసమే ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. 

వెస్టిండీస్ క్రికెటర్, పంజాబ్ కింగ్స్ జట్టు ఆటగాడు క్రిస్ గేల్ కొత్త అవతారం ఎత్తాడు. ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ జట్టు తరపున చెలరేగిపోయే గేల్.. ఇప్పుడు పంజాబీ డాడీగా మారిపోయాడు. అందుకోసం తలకు తలపాగా కూడా చూట్టేశాడు. దీనికి సంబంధించిన ఫోటోని ఆయన తన స్టేటస్ లో షేర్ చేయగా.. అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఏదో షూట్ లో భాగంగా ఆయన తన తలకు తలపాగా చుట్టినట్లు అర్థమౌతోంది. దానిని ఆయన తన స్టేటస్ లో పేర్కొనడం గమనార్హం. రేపటి షో కోసం చాలా ఆతురతగా ఉందని.. దాని కోసమే ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. క్రిస్ గేల్ ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడిన సంగతి తెలిసిందే. అయితే.. కరోనా నేపథ్యంలో ఐపీఎల్ సీజన్ రద్దు అయ్యింది. కాగా.. ఈ వెస్టిండీస్ ఆటగాడు త్వరలో ఈ ఏడాది జులై జరగనున్న టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ లో తలపడనున్నాడు.

ఇదిలా ఉండగా.. ఆయన ఇటీవల ఓ కారు కొనుగోలు చేయగా.. దాని ఫోటోని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ఆ ఫోటోకి ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ రిప్లై ఇవ్వడం విశేషం. అది తన కారు లాంటిదేనని వార్నర్ పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా.. ఆస్ట్రేలియాతో జరగనున్న టీ20 ఇంటర్నేషనల్ లో.. గేల్, వార్నర్ ప్రత్యర్థులుగా తలపడనున్నారు. 

View post on Instagram