ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7 లో జైపూర్ పింక్ పాంథర్స్ విజయయాత్రకు యూపీ యోదాస్  బ్రేక్ వేసింది. వరుస విజయాలతో దూసుకుపోతూ పాయింట్స్ పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జైపూర్ ఈ సీజన్లో రెండో ఓటమిని  చవిచూసింది. కేవలం 7 పాయింట్ల తేడాతో యూపీ విజయాన్ని అందుకుంది. పాంథర్స్ స్టార్ రైడర్ దీపక్ నివాస్ హుడా 9 పాయిట్లతో టాప్ స్కోరర్ గా నిలిచిన జట్టను విజయతీరాలకు చేర్చలేకపోయాడు. 

యూపీ ఆటగాళ్ల సమిష్టి పోరాటంతో జట్టుకు విజయాన్ని అందించారు. సురేందర్ గిల్ 8, శ్రీకాంత్ జాదవ్ 7, రిశాంక్ దేవడిగ 4, సుమిత్ 4 పాయింట్లతో అదరగొట్టారు. మిగతావారిలో నితేశ్ 2, మోహసెన్ 2,అ అశు 1, అమిత్ లు 1 పాయింట్ సాధించారు. ఇలా రైడింగ్ లో 18, ట్యాకిల్స్ లో 11, ప్రత్యర్థిని ఒకసారి ఆలౌట్ చేయడం ద్వారా 2 ఇలా మొత్తం 31 పాయింట్లు సాధించి పింక్ పాంథర్స్ పై ఆధిక్యాన్ని ప్రదర్శిచింది. 

పాంథర్స్ జట్టులో స్టార్ రైడర్ దీపక్ ఒక్కడే 9 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. అలాగే విశాల్ 4, నితిన్ 4, దీపక్ 2 పాయింట్లు సాధించారు. అయినప్పటికి ప్రత్యర్థి కంటే 7 పాయింట్లు వెనుకబడి ఓటమిపాలయ్యింది. 

పాంథర్స్  రైడింగ్ లో కేవలం 15, ట్యాకిల్స్ లో 9, ఎక్స్‌ట్రాల రూపంలో 1 ఇలా అన్నిట్లోనూ యూపీ కంటే తక్కువ పాయింట్లు సాధించింది. దీంతో 31-24 తేడాతో యూపీ  యోదాస్ విజయాన్ని అందుకోగలిగింది.