సీజన్ 7 లో భాాగంగా జరుగుతున్న ప్రో కబడ్డి లీగ్  కు ప్రస్తుతం పాట్నాలోని పాటలీపుత్ర స్పోర్ట్స్ క్లబ్ ఆతిథ్యమిస్తున్నవిషయం తెలిసిందే. ఇలా సొంత మైదానంలో బిహార్ ప్రేక్షకుల మధ్య జరిగిన మ్యాచ్ లో పాట్నా పైరేట్స్ పేలవ ఆటతీరు  కనబర్చింది. అలాగే ప్రత్యర్ధి హర్యానా ఆటగాళ్లు అదరగొట్టడంతో 9 పాయింట్ల తేడాతో పాట్నా పరాజయంపాలయ్యింది. 

ఈ మ్యాచ్ లో ఇరు జట్లు హోరాహోరీగా పోరాడాయి. ఇలా పాట్నా రైడర్లు హర్యానా రైడర్లతో సమాన స్ధాయిలో పోరాడినా ఢిపెండర్స్ మాత్రం ఆకట్టుకోలేకపోయారు. ప్రత్యర్థి రైడర్లను అడ్డుకోవడంలో విఫలమైన పాట్నా  ట్యాకిల్స్ లో కేవలం 6 పాయింట్లు మాత్రమే సాధించగా  హర్యానా మాత్రం 12 పాయింట్లతో ఆకట్టుకుంది. ఇలా హర్యానా విజయంలో డిఫెండర్స్  ప్రదాన పాత్ర పోషించారు. 

ఇక ఆటగాళ్ల విషయానికి వస్తే పాట్నా స్టార్ రైడర్ ప్రదీప్ నర్వాల్ 14 పాయింట్లతో ఆకట్టుకున్నాడు.  ఇతడు తప్ప మిగతా ఆటగాళ్లెవరూ కనీస పాయింట్లు కూడా సాధించకపోవడంతో పాట్నాకు ఓటమి తప్పలేదు. 

హర్యానా ఆటగాళ్లలో వికాస్ 11, వినయ్ 6, రవి కుమార్ 4, సునీల్ 4, ధన్ రాజ్ 3, నవీన్ 2 పాయింట్లతో ఆకట్టుకున్నారు. ఇలా జట్టులోని ఆటగాళ్లందరు తలో కొన్ని పాయింట్లు సాధించి హర్యానా గెలుపులో కీలకంగా వ్యవహరించారు. ఇలా హర్యానా  26-35  పాయింట్ల  తేడాతో విజయాన్ని అందుకుంది.