దేశ ఆర్థిక రాజధాని ముంబై వేదికన జరిగిన ప్రో కబడ్డి లీగ్ 7 లో గుజరాత్ ఫార్చూనర్స్ జాయింట్ జట్టు అదరగొట్టింది. వల్లభాయ్ పటేల్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో గుజరాత్-దబాంగ్ డిల్లీ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఓ దశలో ఇరుజట్లు సమానంగా పాయింట్లు సాధిస్తూ ముందుకు కదిలాయి. అయితే చివరకు పార్చూనర్ జాయింట్స్ టీం ఆటగాళ్లు కాస్త దూకుడు పెంచి డిల్లీని వెనక్కినెట్టారు. ఇలా కేవలం 5 పాయింట్ల తేడాతో గుజరాత్ టీం విజయాన్ని అందుకుంది. 

గుజరాత్ జట్టు రైడింగ్ ద్వారా 17, ట్యాకిల్స్ లో 10,  ప్రత్యర్ధిని ఆలౌట్ చేయడం ద్వారా 2, ఎక్స్‌ట్రాల రూపంలో మరో 2 ఇలా మొత్తం  31 పాయింట్లు సాధించింది. అయితే డిల్లీ మాత్రం రైడింగ్ లో 13, ట్యాకిల్స్ లో 9 పాయింట్లతో వెనకబడింది. మిగతా ఆలౌట్,ఎక్స్‌ట్రాల ద్వారా నాలుగు పాయింట్లు  సాధించినా మొత్తం 26 పాయింట్ల వద్దే నిలిచింది. దీంతో గుజరాత్ 31-21 తేడాతో విజయాన్ని అందుకుంది. 

ఆటగాళ్ల విషయానికి వస్తే డిల్లీ రైడర్ నవీస్ కుమార్ అత్యధికంగా 10 పాయింట్లతో  ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత చంద్రన్ రంజిత్ ఒక్కడే 5 పాయింట్లతో పరవాలేదనిపించాడు. గుజరాత్ ఆటగాళ్లలో అయితే మోరే 9, రోహిత్ 8, సచిన్ 4 పాయింట్లతో రాణించారు.