9 ఫోర్లు, 7 సిక్సర్లు.. 194.55 స్ట్రైక్ రేట్ తో ప‌రుగుల వ‌ర‌ద‌.. డీపీఎల్‌లో తొలి సెంచరీ

DPL 2024-Priyansh Arya : ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2024 15వ మ్యాచ్ లో అత్యధిక స్కోరు నమోదైంది. తుఫాను ఇన్నింగ్స్ ఆడి ఈ లీగ్‌లో తొలి సెంచరీ బాదాడు 23 ఏళ్ల బ్యాట్స్‌మెన్ ప్రియాంష్ ఆర్య.

Priyansh Arya hit 9 fours, 7 sixes at a strike rate of 194.55 and scored first century in the DPL 2024 RMA

DPL 2024-Priyansh Arya : ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2024 ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. యంగ్ ప్లేయ‌ర్ల‌తో పాటు స్టార్ సీనియర్ ప్లేయ‌ర్లు పాల్గొంటున్న ఈ లీగ్ క్రికెట్ ల‌వ‌ర్స్ కు మంచి వినోదాన్ని పంచుతోంది. ఈ క్ర‌మంలోనే తాజాగా 23 ఏళ్ల ఓ యంగ్ ప్లేయ‌ర్లు సిక్స‌ర్లు, ఫోర్ల‌లో బౌల‌ర్ల‌ను ఉతికిపారేస్తూ ఈ టోర్నీలో అత్య‌ధిక ప‌రుగుల రికార్డుతో పాటు డీపీఎల్ లో తొలి సెంచ‌రీ సాధించిన ప్లేయ‌ర్ గా రికార్డు సృష్టించాడు. అత‌నే ప్రియాంష్ ఆర్య. సౌత్ ఢిల్లీ త‌ర‌ఫున ఆడుతున్న అత‌ను సూప‌ర్ బ్యాటింగ్ తో అద‌ర‌గొట్టాడు. 

డీపీఎల్ లో తొలి సెంచరీ..

డీపీఎల్ 15వ మ్యాచ్ సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్, పురానీ ఢిల్లీ జట్ల మధ్య జరిగింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ 88 పరుగుల తేడాతో పురాని ఢిల్లీపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 23 ఏళ్ల ఓపెనర్ ప్రియాంష్ ఆర్య సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్స్ విజయంలో హీరోగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ప్రియాంష్ ఆర్య సెంచరీతో అదరగొట్టాడు. దీంతో ఈ లీగ్‌లో సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

ప్రియాంష్ ఆర్య తుఫాను ఇన్నింగ్స్.. 

ఈ మ్యాచ్‌లో పురానీ ఢిల్లీ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ సూపర్ స్టార్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. ఈ లీగ్‌లో ఇదే అత్య‌ధిక స్కోర్. ప్రియాంష్ ఆర్య 55 బంతుల్లో 107 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. త‌న ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు. 194.55 స్ట్రైక్ రేట్‌తో ప్రియాంష్ ఆర్య ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. ఈ మ్యాచ్‌లో సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ ఓపెనర్లు ప్రియాంష్ ఆర్య, సార్థక్ రంజన్ జట్టుకు శుభారంభం అందిచారు. ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు101 పరుగుల భాగస్వామ్యం అందించారు. సార్థక్ రంజన్ 37 బంతుల్లో 49 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో పాటు కెప్టెన్ ఆయుష్ బడోని 20 బంతుల్లో 56 పరుగులతో ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ ఆడారు. సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ ప్లేయర్లు తమ ఇన్నింగ్స్‌లో 18 సిక్సర్లు, 17 ఫోర్లు బాదారు. 

బౌలర్లు కూడా రెచ్చిపోయారు.. 

236 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పురానీ ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో భారీ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. పురానీ ఢిల్లీ లో అర్నవ్ బగ్గా అత్యధిక స్కోరు 36 పరుగులు చేయగా మిగ‌తా ప్లేయ‌ర్లు పెద్ద ఇన్నింగ్స్ లు ఆడ‌లేకపోయారు. సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ తరఫున దిగ్వేష్ రాఠీ మూడు వికెట్లు తీయగా, అన్షుమన్ హుడా, విజన్ పంచల్ చెరో రెండు వికెట్లు తీశారు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios