గర్ల్‌ఫ్రెండ్ నిధి తపడియాకి వాలంటైన్స్ డే విషెస్ తెలుపుతూ రొమాంటిక్ ఫోటో షేర్ చేసిన పృథ్వీషా... వెంటనే డిలీట్! అది నేను కాదు, ఎవరో ఎడిట్ చేశారంటూ పోస్ట్...
ఐసీసీ అండర్19 వన్డే వరల్డ్ కప్ గెలిచి, టీమిండియాలోకి దూసుకొచ్చిన ప్లేయర్ పృథ్వీ షా. ఆరంగ్రేటం టెస్టులోనే సెంచరీ చేసి, తన టెక్నిక్‌తో విమర్శకుల మన్ననలు గెలుచుకున్నాడు పృథ్వీ షా.. వీరేంద్ర సెహ్వాగ్ దూకుడు, సచిన్ టెండూల్కర్ హైట్, బ్రియాన్ లారా టెక్నిక్ కలిపితే పృథ్వీ షా అని, టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలు.. అప్పట్లో హాట్ టాపిక్ అయ్యాయి..
నిషేధిక ఉత్ప్రేరకాలు వాడి కొన్ని రోజులు, టీమ్‌కి దూరమైన పృథ్వీ షా, ఆడిలైడ్ టెస్టులో ఫెయిల్ అయిన తర్వాత జట్టులో చోటు కోల్పోయాడు. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో పృథ్వీ షాకి చోటు దక్కినా, ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం ఇవ్వలేదు పొట్టి ఫార్మాట్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా...
వాలంటైన్స్ డే సందర్భంగా తన గర్ల్‌ఫ్రెండ్ నిధి తపడియాకి ముద్దు పెడుతున్న ఓ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు పృథ్వీ షా. అంతా బాగానే ఉంది కానీ కాప్షన్‌లో ‘హ్యాపీ వాలంటైన్స్ డే, వైఫీ’ అని రాశాడు. వెంటనే తప్పు తెలుసుకుని ఆ పోస్ట్ డిలీట్ చేసినా అప్పటికీ చాలా మంది అభిమానులు దాన్ని చూడడం, స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసేయడం జరిగిపోయాయి... దీంతో మనోడికి సీక్రెట్‌గా పెళ్లైపోయిందా? అనే అనుమానాలు రేగుతున్నాయి..
నిధి తపడియాతో పృథ్వీ షా డేటింగ్ చేస్తున్నాడనే విషయం అందరికీ తెలుసు కానీ పెళ్లి ఎప్పుడు చేసుకున్నారు? వైఫ్ ఎప్పుడు అయ్యింది... సైలెంట్‌గా పెళ్లి తంతు కానిచ్చేశారా? అని అనుమానాలతో పృథ్వీ షాకి వేల మెసేజ్‌లు వచ్చేశాయట..
తాను పెట్టిన కాప్షన్‌కి పెద్ద దుమారమే రేగడంతో తన పోస్టుపై క్లారిటీ ఇస్తూ మరో పోస్ట్ చేశాడు పృథ్వీ షా. ‘ఎవరో నా ఫోటోలను ఎడిట్ చేసి, ఇదంతా చేస్తున్నారు. నేను నా ఇన్‌స్టా స్టోరీలో కానీ, నా పేజీలో కానీ ఏమీ పోస్ట్ చేయలేదు. అలాంటి ట్యాగ్స్, మెసేజ్‌లు ఉన్న ఫోటోలను పట్టించుకోకండి...’ అంటూ రాసుకొచ్చాడు పృథ్వీ షా...
అయితే అభిమానులు షేర్ చేస్తున్న ఫోటోలు పృథ్వీ షా స్టేటస్‌లోవేనని, క్లియర్‌గా తెలుస్తోంది. దీంతో ఈ ముంబై కుర్రాడు, కవర్ చేసుకోవడానికి ఇలా పోస్టులు పెడుతున్నారని అందరికీ అర్థమైపోతోంది...
దేశవాళీ టోర్నీల్లో అదరగొడుతున్న పృథ్వీ షా, సెలక్టర్ల దృష్టిని మాత్రం ఆకర్షించలేకపోతున్నాడు. గత ఐపీఎల్ సీజన్‌కి ముందు బీసీసీఐ నిర్వహించిన యో-యో టెస్టులో పృథ్వీ షా ఫెయిల్ అయ్యాడు. దీంతో అతన్ని టీ20 వరల్డ్ కప్ 2022 టీమ్‌కి అనుకుంటున్న ప్లేయర్ల జాబితాలో కూడా పట్టించుకోలేదు సెలక్టర్లు... రంజీల్లో రికార్డుల వర్షం కురిపిస్తున్న సర్ఫరాజ్ ఖాన్‌ని కూడా కేవలం ఫిట్‌నెస్ కారణంగానే సెలక్టర్లు పట్టించుకోవడం లేదని విమర్శలు కూడా ఉన్నాయి.
ఫిట్‌నెస్‌పై బాగా ఫోకస్ పెట్టిన పృథ్వీ షా, ఈ మధ్య బరువు తగ్గాడు. యోయో టెస్టు కూడా క్లియర్ చేశాడు. అయినా సెలక్టర్లు పట్టించుకోకపోవడంతో ‘సాయిబాబా’ అనుగ్రహం కోసం ఎదురుచూస్తున్నానంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు చేస్తూ... సోషల్ మీడియా మీమ్స్‌లో తెగ వైరల్ అవుతున్నాడు..
