ఆస్ట్రేలియా టూర్‌లో బీభత్సమైన ట్రోలింగ్ ఎదుర్కొంటున్నాడు యంగ్ సెన్సేషనల్ బ్యాట్స్‌మెన్ పృథ్వీషా. రెండు ప్రాక్టీస్ మ్యాచుల్లో పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయిన పృథ్వీ, మొదటి టెస్టులోనూ అదే పర్ఫామెన్స్ కంటిన్యూ చేశాడు.

మొదటి ఇన్నింగ్స్‌లో రెండో బంతికే డకౌట్ అయిన పృథ్వీషా, రెండో ఇన్నింగ్స్‌లో 4 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఈ పర్ఫామెన్స్ తర్వాత పృథ్వీషాపైన సోషల్ మీడియాలో బీభత్సమైన కార్టూన్స్, మీమ్స్, ట్రోల్స్ వచ్చాయి. అయితే తనను విమర్శిస్తున్నవారికి ఓ కొటేషన్‌తో సమాధానం ఇచ్చాడు పృథ్వీషా...

‘నువ్వు ఓ పని చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కొందరు నిన్ను నిరుత్సాహపరచడానికి ప్రయత్నిస్తుంటారు... దాని అర్థం నువ్వు ఆ పని చేయగలవు, వాళ్ల వల్ల అది కాదు...’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టేటస్ పెట్టాడు 21 ఏళ్ల పృథ్వీషా.