ఫామ్‌లోకి వచ్చాడని సంతోషించేలోపు గాయంతో... నాలుగు నెలల పాటు పృథ్వీ షా అవుట్...
ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్‌లో పృథ్వీ షా మోచేతికి తీవ్ర గాయం... కోలుకోవడానికి 4 నుంచి 5 నెలల సమయం పడుతుందని తేల్చిన వైద్యులు..
అల్లు అర్జున్ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలో ‘మీకు అదృష్టం వచ్చి హగ్ ఇచ్చేలోపు, దురదృష్టం వచ్చి లిప్ లాక్ ఇచ్చి వెళ్లిపోయింది’ అనే డైలాగ్ ఉంటుంది. క్రికెట్ ప్రపంచంలో ఈ డైలాగ్, ముంబై యంగ్ బ్యాటర్ పృథ్వీ షాకి కరెక్టుగా సెట్ అవుతుంది..
తన కెప్టెన్సీలో ఆడిన శుబ్‌మన్ గిల్, టీమిండియాకి త్రీ ఫార్మాట్ ప్లేయర్ అయితే, కెప్టెన్‌గా అండర్19 వరల్డ్ కప్ గెలిచిన పృథ్వీ షా మాత్రం టీమిండియాలో చోటు ఎప్పుడు వస్తుందా? అని ఆశగా ఎదురుచూసే స్టేజీలోనే ఉన్నాడు. టాలెంట్ పుష్కలంగా ఉన్నా, అంతకుమించిన ఓవర్ కాన్ఫిడెన్స్, బద్ధకం, దానికి మించి టన్నుల్లో బ్యాడ్ లక్ పృథ్వీ షాని వెంటాడుతూ ఉన్నాయి..
ఐపీఎల్ 2023 సీజన్‌లో అట్టర్ ఫ్లాప్ అయిన పృథ్వీ షా, ఆఖరికి తుది జట్టులో చోటు కూడా కోల్పోయి స్థితికి చేరుకున్నాడు. ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్‌లో నార్తంప్టన్‌షైర్ క్లబ్ తరుపున వరుసగా బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేసిన పృథ్వీ షా.... గాయంతో కౌంటీ క్లబ్ నుంచి దూరమయ్యాడు..
తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో గాయం కారణంగా పృథ్వీ షా మోచేతి ఎముకకి తీవ్ర గాయమైనట్టు తేలింది. గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు నాలుగు నుంచి 5 నెలల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు..
పృథ్వీ షా ఎముక వాపు వచ్చిందని తేలడంతో ప్రస్తుతం అతను బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో చికిత్స తీసుకుంటున్నాడు. పృథ్వీ షా గాయానికి సర్జరీ చేయాల్సి ఉంటుందా? లేదా? అనే విషయాన్ని మరికొన్ని రోజుల్లో ఖరారు చేయబోతున్నారు..
ఇప్పటిదాకా టీమిండియా తరుపున 5 టెస్టులు, 6 వన్డేలు ఆడిన పృథ్వీ షా, ఒకే ఒక్క టీ20 మ్యాచ్ ఆడాడు. శ్రీలంకలో టీ20 ఆరంగ్రేటం చేసిన పృథ్వీ షా, కరోనా బారిన పడడంతో ఆ తర్వాత మరో అవకాశం దక్కించుకోలేకపోయాడు..
కెరీర్ ఆరంభంలో గాయం మానడానికి నిషేధిత ఉత్ప్రేరకాలు వాడి, కొంత కాలం క్రికెట్‌కి దూరమైన పృథ్వీ షా.. ఆడిలైడ్ టెస్టులో అట్టర్ ఫ్లాప్ పర్ఫామెన్స్ తర్వాత టెస్టుల్లో తిరిగి చోటు దక్కించుకోలేకపోయాడు. సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్స్ సప్నా గిల్‌తో గొడవతో పృథ్వీ షా వార్తల్లో నిలిచాడు.
నార్తాంప్టన్‌షైర్ జరిగిన మొదటి మ్యాచ్‌లో 35 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 34 పరుగులు చేసిన పృథ్వీ షా, పుల్ షాట్‌కి ప్రయత్నించి హిట్ వికెట్‌గా పెవిలియన్ చేరాడు. సోమర్‌సెట్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో 153 బంతుల్లో 28 ఫోర్లు, 11 సిక్సర్లతో 244 పరుగులు చేసి అద్భుత సెంచరీతో దుమ్మురేపాడు పృథ్వీ షా.. ఆ తర్వాత డర్హం క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 76 బంతుల్లో 15 ఫోర్లు, 7 సిక్సర్లతో 125 పరుగులు చేసి అజేయ సెంచరీతో మ్యాచ్‌ని గెలిపించాడు..
4 మ్యాచుల్లో 143 యావరేజ్‌తో 152.67 స్ట్రైయిక్ రేటుతో 429 పరుగులు చేసిన పృథ్వీ షా, డర్హంతో జరిగిన మ్యాచ్‌లో గాయంతో టోర్నీ నుంచి వైదొలిగాడు.