Asianet News TeluguAsianet News Telugu

పృథ్వీషా మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్... ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు బాది...

శివమ్ మావి వేసిన మొదటి ఓవర్‌లో ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు బాదిన పృథ్వీషా...

ఐపీఎల్ చరిత్రలో అజింకా రహానే తర్వాత ఆ ఫీట్ సాధించిన ప్లేయర్‌గా రికార్డు...

Prithvi Shaw beats six fours in Six balls against Kolkata knight Riders CRA
Author
India, First Published Apr 29, 2021, 10:33 PM IST

ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ పృథ్వీషా... మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. శివమ్ మావి వేసిన మొదటి ఓవర్‌లో ఆరు బంతులను ఆరు ఫోర్లుగా మలిచాడు పృథ్వీషా... ఐపీఎల్ చరిత్రలో మొదటి ఓవర్ మొదటి ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు బాదిన మొట్టమొదటి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు పృథ్వీషా. 

ఇంతకుముందు 2012లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ అజింకా రహానే, ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు బాదాడు.  ఎస్ అరవింద్ వేసిన ఓవర్‌లో రహానే, ఆరు ఫోర్ల రికార్డు తర్వాత ఆ ఫీట్ సాధించిన తర్వాత శివమ్ మావి ఓవర్‌లో ఆరు బౌండరీలు బాది రెండో ప్లేయర్‌గా నిలిచాడు పృథ్వీషా.

 బౌలర్ ఎవ్వరైనా, బంతి ఎలాంటిదైనా సంబంధం లేకుండా బౌండరీల మోత మోగించిన పృథ్వీషా... ఐపీఎల్ 2021 సీజన్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదుచేశాడు. 18 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ బాదిన పృథ్వీషా... ఐపీఎల్ కెరీర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున మూడో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదుచేశాడు.

2016లో క్రిస్ మోరిస్ 17 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదగా, 2019లో రిషబ్ పంత్ 18 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. పృథ్వీషా, పంత్ రికార్డును సమం చేశాడు. 14 బంతుల్లో 48 పరుగులు చేసిన రిషబ్ పంత్, ఆ తర్వాత 2 పరుగులు చేసేందుకు 4 బంతులు వాడడంతో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు.

Follow Us:
Download App:
  • android
  • ios