కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యజమాని ప్రీతి జింటా... చెన్నై కెప్టెన్ ధోనీకి స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. అసలు ఏం జరిగిందంటే గత ఆదివారం చెన్నై సూపర్‌కింగ్స్‌తో తన చివరి లీగ్ మ్యాచ్ ఆడిన పంజాబ్... 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

వరుస ఓటముల తర్వాత ఆఖరి మ్యాచ్‌‌లో విజయం సాధించడంతో ప్రీతి ఆనందం వ్యక్తం చేస్తూ.. మైదానంలో సందడి చేశారు. అనంతరం ధోనీతో కరచాలనం చేశారు. ఆ తర్వాత ట్వీట్టర్‌లో ‘‘ కెప్టెన్ కూల్‌కి చాలామంది అభిమానులున్నారు..

వారిలో తానొకరిని.. అయితే ఈ మధ్యకాలంలో తాను ధోనీతో పాటు ఆయన గారాలపట్టి జీవాకు కూడా ఫ్యాన్‌ని అయ్యానన్నారు. తన దృష్టి ఆమెపై పడిందని.. జీవా విషయంలో జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాను.. ఆమెను కిడ్నాప్ చేయాలనుకుంటున్నాను అంటూ ప్రీతి జింటా ట్విట్టర్‌లో సరదాగా వ్యాఖ్యానించారు.