Asianet News TeluguAsianet News Telugu

ఇతగాడు ప్రీతీజింటానే ఎంటర్‌టైన్ చేశాడట...(వీడియో)

ఐపిఎల్.... ధనా ధన్ ఇన్నింగ్సులు, కళ్లు చెదిరే సిక్సర్లు, బ్యాట్ మెన్స్ వీరబాదుడు, చీర్ గల్స్ చిందులతో అభిమానులకు క్రికెట్ మజా ఏంటో రుచిచూపించింది. అయితే ముంబై ఇండియన్స్, పంజాబ్ జట్ల మధ్య ఇటీవల జరిగిన మ్యాచ్ లో ఈ ఐపిఎల్ మజాకు మరింత ఎంటర్ ‌టైన్ మెంట్ తోడయ్యింది.  మ్యాచ్ చూడటానికి వచ్చిన ఓ అభిమాని తన విచిత్రమైన డ్యాన్స్ తో మైదానంలోని అభిమానులనే కాదు మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన సెలబ్రిటీలను సైతం ఆకట్టుకున్నాడు. ఎంతలా అంటే మ్యాచ్ ఉత్కంఠగా సాగుతున్న సమయంలో తమను ఆ అభిమాని ఎంతగానో ఎంటర్ టైన్ చేశాడని హీరోయిన్ ప్రీతీజింటా ట్విట్టర్ లో ప్రశంసించిందంటే అతడెంతలా ఆకట్టుకున్నాడో మీరే అర్థం చేసుకోవచ్చు.

preethi jinta tweet about dancing uncle
Author
Mumbai, First Published Apr 12, 2019, 9:22 PM IST

ఐపిఎల్.... ధనా ధన్ ఇన్నింగ్సులు, కళ్లు చెదిరే సిక్సర్లు, బ్యాట్ మెన్స్ వీరబాదుడు, చీర్ గల్స్ చిందులతో అభిమానులకు క్రికెట్ మజా ఏంటో రుచిచూపించింది. అయితే ముంబై ఇండియన్స్, పంజాబ్ జట్ల మధ్య ఇటీవల జరిగిన మ్యాచ్ లో ఈ ఐపిఎల్ మజాకు మరింత ఎంటర్ ‌టైన్ మెంట్ తోడయ్యింది.  మ్యాచ్ చూడటానికి వచ్చిన ఓ అభిమాని తన విచిత్రమైన డ్యాన్స్ తో మైదానంలోని అభిమానులనే కాదు మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన సెలబ్రిటీలను సైతం ఆకట్టుకున్నాడు. ఎంతలా అంటే మ్యాచ్ ఉత్కంఠగా సాగుతున్న సమయంలో తమను ఆ అభిమాని ఎంతగానో ఎంటర్ టైన్ చేశాడని హీరోయిన్ ప్రీతీజింటా ట్విట్టర్ లో ప్రశంసించిందంటే అతడెంతలా ఆకట్టుకున్నాడో మీరే అర్థం చేసుకోవచ్చు.

ఆ అభిమాని డ్యాన్స్ మైదానంలో డ్యాన్స్ చేస్తున్న  వీడియోను ప్రీతీజింటా  ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఆ వీడియోపై ఈ విధంగా కామెంట్ చేశారు. '' ముంబై-పంజాబ్ ల మధ్య నరాలు తెగే ఉత్కంఠ, టెన్షన్ తో మ్యాచ్ సాగుతున్న సమయంలో ఓ అభిమాని వన్‌మ్యాన్‌ ఆర్మీలా మా అందరిని ఎంటర్‌టైన్‌ చేశాడు. అతడికి ఈ ఫన్నీ డేని అంకితమిస్తున్నాను. నువ్వు డ్యాన్స్ కొనసాగిస్తుండు'' అని పొగుడుతూ ప్రీతి ట్వీట్ చేశారు.

ప్రీతి పోస్ట్ చేసిన వీడియో అభిమానులకు కూడా అమితంగా నచ్చింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఆ అభిమాని ఎవరా అంటూ ఆరా తీసే వరకు వెళ్లింది. అతడు సరదాకోసం చేసినా ఇప్పుడతడు సోషల్ మీడియాలో సెలబ్రిటీ హోదాను సంపాదించుకున్నాడు.  

 

 

Follow Us:
Download App:
  • android
  • ios