Ranji Trophy 2022: జమ్మూ కశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్లు తీసిన ప్రసిద్ధ్ కృష్ణ... 175 పరుగులు చేసి సత్తా చాటిన కరణ్ నాయర్...
రంజీ ట్రోఫీలో కర్ణాటక తరుపున ఆడుతున్న భారత యంగ్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ, అక్కడ కూడా అదిరిపోయే పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. జమ్మూ కశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 28 బంతుల వ్యవధిలో 6 వికెట్లు తీసి అదరగొట్టాడు ప్రసిద్ధ్ కృష్ణ...
ప్రసిద్ధ్ కృష్ణ సెన్సేషనల్ స్పెల్ కారణంగా జమ్మూ కశ్మీర్ జట్టు 29.5 ఓవర్లలో 93 పరుగులకే ఆలౌట్ అయ్యింది... తొలి ఇన్నింగ్స్‌లో కర్ణాటక జట్టు 302 పరుగులకి ఆలౌట్ అయ్యింది. టీమిండియా బ్యాటర్ కరణ్ నాయర్ ఒక్కడే 311 బంతుల్లో 24 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 175 పరుగులు చేయగా సమర్త్ 45 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాటర్లు ఎవ్వరూ 30+ స్కోరు కూడా దాటలేకపోయారు.. దేవ్‌దత్ పడిక్కల్ 8 పరుగులకే అవుట్ కాగా, కెప్టెన్ మనీశ్ పాండే 1 పరుగు చేసి పెవిలియన్ చేరాడు...
త్రిబుల్ సెంచరీ తర్వాత మూడంటే మూడు టెస్టులు మాత్రమే ఆడిన కరణ్ నాయర్‌పై ఇకనైనా టీమిండియా సెలక్టర్లు కరుణ చూపుతారేమో చూడాలి. జమ్మూ కశ్మీర్ ఓపెనర్లు శుభారంభం అందించి, తొలి వికెట్‌కి 55 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే ఆ తర్వాతే ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్ మొదలైంది. 36 బంతుల్లో 5 ఫోర్లతో 25 పరుగులు చేసిన జతిన్ వాద్వాన్‌ను అవుట్ చేసిన ప్రిసిద్ధ్ కృష్ణ, ఆ తర్వాత శుబమ్ సింగ్ పుందీర్‌ను 5 పరుగులకే పెవిలియన్ చేర్చాడు...
ఆల్‌రౌండర్ అబ్దుల్ సమద్ 3, పర్వేజ్ రసూల్ 1, ఫజిల్ రషీద్ 2, ఓపెనర్ కమ్రాన్ ఇక్బాల్ 35 పరుగులు చేసి ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో పెవిలియన్ చేరారు... శ్రేయాస్ గోపాల్ ఓ వికెట్ తీయగా విద్యాధర్ పాటిల్ 2 వికెట్లు తీశాడు. కృష్ణప్ప గౌతమ్ తన మొదటి ఓవర్‌లోనే వికెట్ తీయడంతో జమ్మూ కశ్మీర్ ఇన్నింగ్స్‌కి తెరపడింది...
మొత్తంగా ప్రసిద్ధ్ కృష్ణ 12 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 35 పరుగులిచ్చి 6 వికెట్లు తీయగా, పడిన వికెట్లన్నీ 28 బంతుల వ్యవధిలోనే కావడం విశేషం.
తొలి రంజీ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ చేసి రికార్డు క్రియేట్ చేసిన అండర్ 19 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ యశ్ ధుల్, రెండో మ్యాచ్‌లో నిరాశపరిచాడు. జార్ఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 5 పరుగులకే అవుట్ అయ్యాడు యశ్. నితీశ్ రాణా 14 పరుగులు చేయగా ధృవ్ షోరే 25 పరుగులు చేశాడు. 73 ఓవర్లు ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది ఢిల్లీ జట్టు... తొలుత బ్యాటింగ్ చేసిన జార్ఖండ్, కెప్టెన్ విరాట్ సింగ్ సెంచరీ కారణంగా 251 పరుగులకి ఆలౌట్ అయ్యింది...
ఛత్తీస్‌ఘడ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తమిళనాడు జట్టు 9 వికెట్ల నష్టానికి 470 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. బాబా అపరాజిత్ 166 పరుగులు చేయగా, ఆయన సోదరుడు బాబా ఇంద్రజిత్ 127 పరుగులు చేశాడు. కెప్టెన్ విజయ్ శంకర్ డకౌట్ కాగా షారుక్ కాన్ 69 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...
ఒడిసాతో జరుగుతున్న మ్యాచ్‌లో సౌరాష్ట్ర బ్యాటర్ చిరాగ్ జానీ డబుల్ సెంచరీ బాదాడు. షెల్డన్ జాక్సన్ 75 పరుగులు చేసి అవుట్ కాగా చిరాగ్ జానీ 356 బంతుల్లో 29 ఫోర్లు, 4 సిక్సర్లతో 213 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు...
గోవాతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 163 పరుగులకి ఆలౌట్ అయ్యింది. అజింకా రహానేతో పాటు ముంబై ఇన్నింగ్స్‌లో ఐదుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. పృథ్వీషా 9 పరుగులు చేయగా సర్ఫరాజ్ ఖాన్ 110 బంతుల్లో 9 ఫోర్లతో 63 పరుగులు చేశాడు...
గోవా బౌలర్ లక్షయ్ గార్గ్ 6 వికెట్లు తీయగా అమిత్ యాదవ్ 4 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో 89 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది గోవా. అమోగ్ దేశాయ్ 64, సూయాష్ ప్రభుదేశాయ్ 40, ఏక్‌నాథ్ 50 పరుగులు చేశారు.
