ఎల్‌వైసీఏ కొవై కింగ్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన రాజేశ్... రాజేశ్ మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అశ్విన్...

క్రికెట్ ప్రపంచంలో ఒకేరోజు రెండు విషాద సంఘటనలు చోటు చేసుకున్నాయి. రెండు రోజుల క్రితం యాక్సిడెంట్‌కు గురైన ఆఫ్ఘాన్ ప్లేయర్ నజీముల్లా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోగా... తమిళనాడుకు చెందిన ఓ యంగ్ క్రికెటర్ గుండెపోటుతో మరణించాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో రెండేళ్ల క్రితం ఎంట్రీ ఇచ్చిన స్పిన్నర్ ప్రశాంత్ రాజేశ్ సోమవారం ఆకస్మిక మరణం చెందాడు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఎల్‌వైసీఏ కొవై కింగ్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన రాజేశ్... అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి ఆకట్టుకున్నాడు. టీఎన్‌పీఎల్‌లో పర్ఫామెన్స్‌తో ఐపీఎల్‌లో అదరగొడుతున్న టి.నటరాజన్.. రాజేశ్ ఒకే జట్టుకు ఆడారు.

Scroll to load tweet…

35 ఏళ్ల ప్రశాంత్ రాజేశ్ ఆకస్మిక మరణంపై భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. రాజేశ్ మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అశ్విన్... ‘నీ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’ అంటూ ట్వీట్ చేశాడు.