ఎన్నికలకు మూడు రోజులే ఉండటంతో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అభ్యర్థులు అన్ని రకాల సాధనాలను వాడుతున్నారు. అయితే పోలీసుల నిఘా ఎక్కువ కావడంతో ఏం చేయాలా అని తల పట్టుకున్నారు. 

ఎన్నికలకు మూడు రోజులే ఉండటంతో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అభ్యర్థులు అన్ని రకాల సాధనాలను వాడుతున్నారు. అయితే పోలీసుల నిఘా ఎక్కువ కావడంతో ఏం చేయాలా అని తల పట్టుకున్నారు.

దీంతో వారికి టెక్నాలజీ గుర్తొచ్చింది. గుంటూరు జిల్లాకు చెందిన కొందరు అభ్యర్థులు... ఆన్‌లైన్ ద్వారా ఓటర్లకు టీవీలు, కుక్కర్లు, మిక్సీలు, ఇస్ట్రీపెట్టెలు వంటివి బుక్ చేశారు. ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో ఢిల్లీలోని ఆన్‌లైన్ సంస్థ అధికారులతో మాట్లాడారు..

‘‘ ఎన్నికల సమయంలో ఇలాంటి లావాదేవీలు జరపడం... ఓటర్లను ప్రలోభపెట్టడం కిందకు వస్తుంది. ఎన్నికల నిబంధనల కింద మీ సంస్థపై కేసు నమోదు చేస్తాం.. అలాగే ఎన్నికలు ముగిసే వరకు జిల్లాలో మీ సంస్థ కార్యాలయాలను మూసివేయాలంటూ ఈసీని కోరతామని స్పష్టం చేశారు. దీంతో ఆన్‌లైన్ విక్రయ సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఎన్నికలు ముగిసే వరకు ఎవరి వద్దా భారీ ఆర్డర్లు స్వీకరించబోమని స్పష్టం చేశారు.