దేశంలో పెట్రోల్ ధరలు సెంచరీ మార్కును టచ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే సెంచరీ మార్కు టచ్ చేసిన పెట్రోల్ ధరలపై ప్రతిపక్షాలు, ప్రజలు వివిధ రీతుల్లో నిరసన తెలియచేస్తూనే ఉన్నారు. తాజాగా భోపాల్‌లో ఓ మ్యాచ్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’గా నిలిచిన క్రికెటర్‌కి 5 లీటర్ల పెట్రోల్‌ను బహుమతిగా అందించడం హాట్ టాపక్ అయ్యింది.

భోపాల్‌లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఓ క్రికెట్ టోర్నీ నిర్వహించారు. ఈ టోర్నీలో జరిగిన మొదటి మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిన క్రికెటర్ సలావుద్దీన్ అబ్బాసీ, ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు. అతనికి కానుకగా 5 లీటర్ల పెట్రోల్ క్యాన్‌ను అందచేసింది కాంగ్రెస్.

సోషల్ మీడియాలో ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది. అధికార పక్షాన్ని విమర్శించాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ క్రికెట్ టోర్నీ నిర్వహించిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా!