Asianet News TeluguAsianet News Telugu

PKL 2021: కబడ్డీ.. కబడ్డీ..! రేపట్నుంచే కూత మొదలయ్యేది.. ఇలా చూసేయండి..

Pro Kabaddi League 8: మాయదారి మహమ్మారి కరోనా వల్ల రెండు సీజన్ల పాటు వాయిదా పడ్డ ప్రో కబడ్డీ సీజన్ 8 కు సర్వం సిద్ధమైంది. డిసెంబర్ 22న బెంగళూరు బుల్స్.. యు ముంబాను ఢీ కొనబోతున్నది.

PKL 8: Pro Kabaddi League to be Broadcasted Live In five Languages and 8 channels, Know How to Watch This Season
Author
Hyderabad, First Published Dec 21, 2021, 4:20 PM IST

రెండేండ్లుగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ప్రో  కబడ్డీ లీగ్.. సీజన్ 8 రేపట్నుంచి మొదలుకానున్నది.  బెంగళూరులోని షెరటాన్ గ్రాండ్ బెంగళూరు వైట్ ఫీల్డ్ హోటల్ లో.. పూర్తి కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ జరుగుతున్న ఈ లీగ్ కు ప్రేక్షకులను అనుమతించడం లేదు.  డిసెంబర్ 22న బెంగళూరు బుల్స్.. యు ముంబాను ఢీకొనబోతున్నది. తొలి మ్యాచ్ కోసం సర్వం సిద్ధమైంది. ప్రేక్షకులను అనుమతించకపోవడంతో ఈ మ్యాచులను  ప్రత్యక్షంగా వీక్షించాలని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. కానీ.. 

కరోనా నేపథ్యంలో ఖాళీ స్టేడియాల్లో జరుగుతున్న  ఈ మ్యాచులను టీవీలలో  స్థానిక భాషల్లో కూడా చూడొచ్చు. ఈ మేరకు పీకేఎల్ అధికార ప్రసార హక్కుదారు అయిన స్టార్ స్పోర్ట్స్.. ఐదు భాషల్లో  వీటిని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నది.  ఐదు భాషలు.. ఎనిమిది ఛానళ్లలో ఈ మెగా ఈవెంట్ లైవ్ రానుంది.

ఎక్కడ చూడొచ్చు. .? 

స్టార్ స్పోర్ట్స్ 2 - ఇంగ్లీష్ 
స్టార్ స్టోర్ట్స్ 2 హెచ్డీ - ఇంగ్లీష్ 
స్టార్ స్టోర్ట్స్ 1 - హిందీ 
స్టార్ స్టోర్ట్స్ 1 హిందీ  హెచ్డీ 
స్టార్ స్టోర్ట్స్ ఫస్ట్ హిందీ 
స్టార్ స్టోర్ట్స్ 1 తమిళ్ 
స్టార్ స్టోర్ట్స్ 1 తెలుగు
స్టార్ స్టోర్ట్స్ 1 కన్నడ 

 

స్టార్ స్టోర్ట్స్ తో పాటు డిస్నీ హాట్ స్టార్ లో కూడా ఈ మ్యాచులను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడొచ్చు.

12 జట్లు.. ట్రిపుల్ హెడర్లు..

కాగా.. 12 జట్లు పాల్గొంటున్న ఈ మెగా టోర్నీని రెండు దఫాలుగా నిర్వహించనున్నారు. తొలి దఫా డిసెంబర్ 22 నుంచి జనవరి 20 దాకా సాగనున్నది. రెండో దఫా కు సంబంధించిన షెడ్యూల్ ను త్వరలోనే విడుదల చేయనున్నారు. గతంలో రోజుకు  రెండు మ్యాచులే నిర్వహించగా.. ఈసారి రోజుకు మూడు గేమ్ (ట్రిపుల్ హెడర్స్) లు జరిపించనున్నారు. మొదటి నాలుగు రోజులు ట్రిపుల్ హెడర్స్ ఉన్నాయి. ఆ తర్వాత ప్రతి శనివారం కూడా మూడు గేమ్ లు ఉన్నాయి. 

 

సీజన్ 8 లో భాగంగా తొలి మ్యాచ్  రాత్రి 7.30 గంటలకు బెంగళూరు బుల్స్.. యు ముంబాను ఎదుర్కోనుంది.  ఆ తర్వాత మ్యాచ్ (రాత్రి 8.30 గంటలకు) దక్షిణాదికి చెందిన రెండు అగ్రశ్రేణి జట్లు తెలుగు టైటాన్స్.. తమిళ్ తలైవాస్ మధ్యన జరుగనుంది. మూడో మ్యాచ్.. (రాత్రి 9.30 గంటలకు) బెంగాల్ వారియర్స్.. యూపీ యోధాలను ఢీకొననుంది.   

Follow Us:
Download App:
  • android
  • ios