ఇంగ్లాండ్- ఇండియా టెస్టు సిరీస్‌లో రెండు సార్లు క్రీజులోకి వచ్చిన జార్వో... అతనిపై జీవితకాల నిషేధం విధించిన యార్క్‌షైర్ క్రికెట్ క్లబ్...

సీరియస్‌గా మ్యాచ్ సాగుతున్నప్పుడు, మైదానంలో చొచ్చుకొచ్చి నవ్వులు పూయించాడు ఇంగ్లాండ్ క్రికెట్ ఫ్యాన్ జార్వో. లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో ప్రత్యేక్షమైన జార్వో, మూడో టెస్టులోనూ క్రీజులోకి దూసుకొచ్చి మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు...

సెక్యూరిటీ నిబంధనలను అతిక్రమించిన జార్వోపై జీవితకాల నిషేధం విధించింది యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్. లీడ్స్‌లో సెక్యూరిటీని లెక్కచేయకుండా క్రీజులోకి వచ్చిన జార్వో, తిరిగి వెనక్కి వెళ్లేందుకు కూడా నిరాకరించి, సిబ్బందితో తగువులాడాడు. దాంతో అతన్ని బలవంతంగా బయటికి తీసుకెళ్లారు సిబ్బంది. 

రెండుసార్లు భారత జెర్సీలో క్రీజులోకి దూసుకొచ్చి, సోషల్ మీడియాలో బీభత్సమైన క్రేజ్ తెచ్చుకున్న జార్వో, ఇకపై హెడ్డింగ్‌లేలో మ్యాచ్ చూడలేడు...

Scroll to load tweet…

‘అవును, డానియల్ జార్వీస్‌పై హెడ్డింగ్‌లే‌లోకి జీవితకాల నిషేధం విధించాలని చూస్తున్నాం. అలాగే సెక్యూరిటీ నిబంధనలను అతిక్రమించినందుకు అతనిపై పెనాల్టీ కూడా వేయాలని ఆలోచిస్తున్నాం...’ అంటూ తెలిపాడు యార్క్‌షైర్ క్రికెట్ క్లబ్ స్పోర్ట్స్‌ పర్సన్...


ఒకే వ్యక్తి, రెండుసార్లు క్రీజులోకి వస్తే, ఇండియాలో అయితే ఏం చేసేవాళ్లో మీ ఊహకే వదిలేస్తున్నానంటూ టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.