పింక్ బాల్ టెస్టులో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 63 బంతుల్లో 8 ఫోర్లతో అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ, టెస్టుల్లో 12వ హాఫ్ సెంచరీ నమోదుచేశాడు. విరాట్ కోహ్లీతో కలిసి మూడో వికెట్‌కి 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు రోహిత్ శర్మ...

11 పరుగులు చేసి శుబ్‌మన్ గిల్, ఆ వెంటనే పూజారా డకౌట్ కావడంతో 34 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది టీమిండియా. కెప్టెన్‌గా ఇంగ్లాండ్‌పై టెస్టుల్లో 2 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు విరాట్ కోహ్లీ. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారత కెప్టెన్‌గా నిలిచాడు విరాట్ కోహ్లీ...