భారత్ బాంగ్లాదేశ్ ల మధ్య జరుగుతున్న తొలి మ్యాచులో భారత బౌలర్ల ధాటికి బంగ్లా బ్యాట్స్ మెన్ నిలవలేకపోతున్నారు.బ్యాటింగ్‌కు ఆరంభించిన మొదటి నుండే బంగ్లాదేశ్ స్వల్ప విరామాల్లోనే కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. భారత బౌలర్లు విజృంభించి బౌలింగ్ చేయడంతో బంగ్లా బ్యాటింగ్ ఆదిలోనే కుదేలయింది.
కోల్ కతా : భారత బౌలర్ల ధాటికి చాప చుట్టేసిన బంగ్లాదేశ్, కేవలం 30.3 ఓవెన్లలోనే అల్ అవుట్ అయ్యింది. లిటన్ దాస్ బదులు కంకషన్ సబ్స్టిట్యూట్ ఇబాదత్ హుస్సేన్ కేవలం ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. లంచ్ తరువాత బాంగ్లాదేశ్ తన మిగిలిన 4 వికెట్లు కూడా కోల్పోయింది.
ఆ తరువాత బ్యాటింగ్ కు దిగిన భారత్ జట్టు 5వ ఓవర్లోనే మయాంక్ అగర్వాల్ వికెట్ ను కోల్పోయింది. గత మ్యాచులో డబల్ సెంచరీ సాధించిన ఈ దిగ్గజ క్రికెటర్ కు పింక్ బాల్ మాత్రం కలిసిరానట్టుంది. కేవలం 14 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన చటేశ్వర్ పుజారాతో కలిసి మరో ఓపెనర్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం మొదలుపెట్టాడు.
టీ విరామ సమయానికి భారత్ ఒక వికెట్ నష్టానికి 12 ఓవర్లలో 35 పరుగులు చేసింది. 13 పరుగులతో రోహిత్ శర్మ, 7 పరుగులతో చటేశ్వర్ పుజారా క్రీజులో ఉన్నారు. టీ తరువాత సమయం చాలా కీలకం. ఇప్పుడు మంచు ప్రభావం వల్ల బాల్ పైన బంగ్లా బౌలర్లకు పట్టు దొరకడం కష్టమవుతుంది. చూడాలి భారత బ్యాట్స్ మెన్ ఈ సమయాన్ని ఎలా వినియోగించుకుంటారో చూద్దాం.
పింక్ బాల్ తో భారత పేసర్ ఇషాంత్ శర్మ బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ ను చిత్తు చేశాడు. గులాబీ బంతితో శుక్రవారం కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచులో బంగ్లాదేశ్ 106 పరుగులకే చేతులెత్తేసింది. ఇషాంత్ శర్మకు ఐదు వికెట్లు లభించగా, ఉమేష్ యాదవ్ కు మూడు వికెట్లు దక్కాయి. మొహ్మద్ షమీకి రెండు వికెట్లు లభించాయి. ఇషాంత్ శర్మ టెస్టుల్లో పదోసారి 10వ సారి ఓ ఇన్నింగ్సులో ఐదు వికెట్లు తీసుకున్నాడు. భారత్ లో ఐదు వికెట్లు తీసుకోవడం ఇది రెండోసారి
భారత్ బాంగ్లాదేశ్ ల మధ్య జరుగుతున్న తొలి మ్యాచులో భారత బౌలర్ల ధాటికి బంగ్లా బ్యాట్స్ మెన్ నిలవలేకపోతున్నారు. తొలి మూడు ఓవర్ల పాటు బాల్ గ్రిప్ దొరికిచ్చుకోవడంలో భారత బౌలర్లు ఒకింత కష్టపడ్డా, ఒక్క సారి లయ దొరకబుచ్చుకున్నాక మాత్రం వారికి ఎదురు లేకుండా పోయింది.
భారత్ గత 23 ఇన్నింగ్సుల నుంచి కూడా స్వదేశంలో ఆడిన ఏ మ్యాచులోనూ ప్రత్యర్థి ఓపెనర్లను 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పనివ్వలేదు. అదే అప్రతిహత రికార్డును ఈ మ్యాచులోను కొనసాగించి ఆ 23 ఇన్నింగ్సుల రికార్డును 24 కు పెంచారు.
బ్యాటింగ్‌కు ఆరంభించిన మొదటి నుండే బంగ్లాదేశ్ స్వల్ప విరామాల్లోనే కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. భారత బౌలర్లు విజృంభించి బౌలింగ్ చేయడంతో బంగ్లా బ్యాటింగ్ ఆదిలోనే కుదేలయింది.
టీ విరామానికి 21.4 ఓవర్లు ముగిసాయి. ఈ ఫస్ట్ సెషన్ ముగిసే సరికి బంగ్లాదేశ్ 6 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసింది. లిటన్ దాస్ హెల్మెట్ పై షమీ వేసిన బంతి బలంగా తగలడంతో దాని వల్ల అతను ఇబ్బందిలో పడుతుండగా మరో మారు ఫీజియో అతని వద్దకు వచ్చాడు. అంపైర్లు టీ విరామాన్ని ప్రకటించారు. లిటన్ దాస్ రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరగడంతో అంపైర్లు లంచ్ విరామాన్ని కూడా ప్రకటించారు.
ఈ 6 వికెట్లలో ముగ్గురు డకౌట్లగా పెవిలియన్ చేరడం గమనార్హం. బంగ్లా కోల్పోయిన 6 వికెట్లలో ఉమేశ్ యాదవ్ 3 వికెట్లు సాధించగా, ఇషాంత్ రెండు వికెట్లు పడగొట్టగా, షమీ ఒక వికెట్ తీశాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌ను షాద్‌మన్ ఇస్లామ్-ఇమ్రుల్ కేయిస్‌లు ప్రారంభించారు. బంగ్లా 15 పరుగుల వద్ద ఉండగా ఇమ్రుల్(4) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఇమ్రుల్‌ను ఇషాంత్ శర్మ ఎల్బీగా ఔట్ చేశాడు.
ఇక ఆ తరువాత డక్ అవుట్ల పర్వం కొద్దీ సేపు కొనసాగింది. ఆపై కెప్టెన్ మోమినుల్ హక్, మహ్మద్ మిథున్, ముష్పికర్ రహీమ్‌లు డకౌట్లుగా పెవిలియన్ చేరారు. మోమినుల్, మిథున్‌లను ఉమేశ్ యాదవ్ ఔట్ చేయగా, రహీమ్‌ను షమీ పెవిలియన్‌కు పంపాడు. మూడు బంతుల వ్యవధిలో ఉమేశ్ రెండు వికెట్లు తీయడం విశేషం.
వీరు వికెట్లు కోల్పోతున్నా, ఓపెనర్ షాద్ మన్ ఇస్లాం మాత్రం కుదురుకుని ప్రయత్నం చేసాడు. కానీ అతని ప్రయత్నం ఎక్కువసేపు నిలవలేదు. 29 పరుగుల వద్ద కీపర్ సాహా అందుకున్న ఒక అద్భుతమైన క్యాచ్ తో వెనుదిరిగాడు.
మరో 5 ఓవర్లు ముగిసే సరికి 20వ ఓవర్లో మహ్మదుల్లా కూడా మరోసారి సాహా చేతికే చిక్కాడు. సాహా అందుకున్న ఈ క్యాచ్ మాత్రం అద్భుతమని చెప్పాలి. ఇషాంత్ శర్మ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.
