Australian Cricketers Salaries: ప్రపంచంలో అత్యంత ధనవంతమైన క్రికెట్ బోర్డుగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ని చెబుతుంటారు.  కానీ క్రికెట్ ఆస్ట్రేలియా  ఆ దేశ  క్రికెటర్లకు ఇచ్చే జీతాలు చూస్తే బీసీసీఐ కూడా దిగదుడుపే అనిపించక మానదు. 

ప్రపంచ క్రికెట్ ను శాసిస్తున్నామని.. అత్యంత ధనవంతమైన క్రికెట్ బోర్డు అని బీసీసీఐపై విదేశీ మీడియాలు తమ అక్కసును వెళ్లగక్కుతుంటాయి. బీసీసీఐ గ్రేడ్ ఏ ప్లస్ క్రికెటర్లు (రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా) కోటానుకోట్లు సంపాదిస్తున్నారని లెక్కలు వేస్తారు. కానీ క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం మనకంటే అక్కడి క్రికెటర్లకు డబుల్ సాలరీలు అందిస్తున్నది. ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అందరికంటే ఎక్కువ సంపాదించే క్రికెటర్. అతడి వార్షిక వేతనం 2 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 15 కోట్లు). బీసీసీఐ మాజీ సారథి, గ్రేడ్ ఏ ప్లస్ జాబితాలో ఉన్న విరాట్ కోహ్లి వార్షిక వేతనం రూ. 7 కోట్లు.

క్రికెట్ ఆస్ట్రేలియా తాజాగా తన క్రికెటర్లకు అందించే వార్షిక వేతనాలను పునరుద్ధరించింది. ‘ది ఏజ్’ అనే ఆసీస్ పత్రిక కథనం ఆధారంగా.. ఆస్ట్రేలియా టెస్టు జట్టులో కీలకంగా ఉన్న ప్యాట్ కమిన్స్ తో పాటు జోష్ హెజిల్వుడ్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబూషేన్ ల వేతనాలకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి.

ఆస్ట్రేలియా లో అత్యధిక సంపాదించే క్రికెటర్లు : 

- ప్యాట్ కమిన్స్ : 15 కోట్లు 
- జోష్ హెజిల్వుడ్ : 1.6 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 12 కోట్లు)
- డేవిడ్ వార్నర్ : 1.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 11 కోట్లు)
(విరాట్, రోహిత్ శర్మ, బుమ్రా లకు వార్షిక వేతనం రూ. 7 కోట్లు) 

ఇతర క్రికెటర్లకు.. 
- స్టీవ్ స్మిత్ : రూ. 10 కోట్లు 
- మిచెల్ స్టార్క్ : రూ. 10 కోట్లు 
- లబూషేన్ : రూ. 8 కోట్లు

మ్యాచ్ పేమెంట్లు : 

- టెస్టులకు 18వేల డాలర్లు (సుమారు రూ. 9.8 లక్షలు) 
- వన్డేలకు 7 వేల డాలర్లు (సుమారు రూ. 3.8 లక్షలు)
- టీ20లకు 5 వేల డాలర్లు (సుమారు రూ. 3 లక్షలు)

Scroll to load tweet…

 పైన పేర్కొన్న ఆస్ట్రేలియా క్రికెటర్ల వార్షిక వేతనాలు చూస్తుంటే బీసీసీఐ మన క్రికెటర్లకు ఇస్తున్న వేతనాల కంటే డబుల్ గా ఉన్నాయి. ఏ గ్రేడ్ ప్లస్ ఆటగాళ్లకు రూ. 7 కోట్లు చెల్లించే బీసీసీఐ. ఏ, బీ, సీ కేటగిరీ లోని ఆటగాళ్లకు వరుసగా రూ. 5 కోట్లు, రూ. 3 కోట్లు, రూ. 1 కోటి మాత్రమే చెల్లిస్తున్నది. మొత్తంగా బీసీసీఐ కాంట్రాక్ట్ పొందిన ఆటగాళ్లు 27 మంది..