INDvsAUS Final: టీమిండియా ఫ్యాన్స్ గాయంపై కారం చల్లిన పాట్ కమ్మిన్స్.. 

INDvsAUS Final: ఫైనల్లో భారత్‌పై ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకుంది. సమయం గడుస్తున్నా అభిమానుల మదిలో నుంచి ఆ చేదు జ్ఞాపకాలు మాత్రం పోవడం లేదు. కానీ ఓటమి గాయాన్ని ఇప్పుటిప్పుడే మానుతున్న తరుణంలో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ (Pat Cummins) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Pat Cummins Comments It Was As Quiet As A Library over Virat Kohli Wicket In Wc 2023 Final KRJ

INDvsAUS Final: పదేళ్ల ఐసీసీ టైటిల్ కల మరోసారి  చెదిరిపోయింది. ప్రపంచకప్ 2023(World Cup 2023)టోర్నీలో అజేయంగా వరుస విజయాలు సాదించిన భారత్ ఫైనల్ కుప్పకూలింది. ఫైనల్లో భారత్‌పై ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధి టైటిల్ కైవసం చేసుకుంది. సమయం గడుస్తున్నా అభిమానుల మదిలో నుంచి ఆ చేదు జ్ఞాపకాలు మాత్రం పోవడం లేదు. ఈ ఓటమితో ఆటగాళ్లతో పాటు అభిమానులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఓటమి టీమిండియా అభిమానుల హృదయాలను కలచివేసింది.  

ఈ విజయంపై తొలిసారి ప్యాట్‌ కమిన్స్‌ (Pat Cummins) స్పందించాడు. ప్రపంచకప్‌ ఫైనల్లో విరాట్‌ కోహ్లీ వికెట్టే మ్యాచ్‌ను కీలక మలుపు తిప్పిందనీ, విరాట్‌ వికెట్‌ తన జీవితాంతం గుర్తుకు ఉంటుందనీ, తనకు అవే అద్భుత క్షణాలనీ చెప్పుకొచ్చాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ వికెట్ పడిన వెంటనే మైదానంలో ఉన్న దాదాపు లక్ష మంది ప్రేక్షకులు లైబ్రరీలో ఉన్నట్లుగా నిశ్శబ్దంగా ఉండిపోయారని ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ చెప్పాడు.  

ప్యాట్‌ కమిన్స్‌ మీడియాతో మాట్లాడుతూ.. 'ట్రోఫీ గెలవాలంటే చాలా కష్టపడాలి. అన్ని ఫార్మాట్లలో టైటిల్స్ గెలవడం వల్ల మనకు ఎంతటి గొప్ప కోచ్‌లు, ఆటగాళ్లు ఉన్నారో తెలుస్తుంది’ అని అన్నాడు.‘11 మంది ఆటగాళ్లతో ఇది సాధ్యం కాదు. ఇందుకోసం 25 మంది మంచి ఆటగాళ్లు కావాలి. ఇది ఆస్ట్రేలియన్ క్రికెట్ బలాన్ని, మరియు ఆటగాళ్లకు గెలవాలనే కోరికను కూడా తెలియజేస్తుందని అన్నారు. 

ప్రపంచకప్ ఫైనల్‌లో విరాట్ కోహ్లీని పాట్ కమిన్స్ అవుట్ చేసినప్పుడు, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో 1 లక్ష 30 వేల మంది ప్రేక్షకులలో పూర్తి నిశ్శబ్దం నెలకొంది. స్టేడియంలో ఎవరూ లేరేమో అన్నట్టు అనిపించిందన్నారు. టీమిండియా అభిమానుల ఈ నిశ్శబ్దాన్ని ఎగతాళి చేశాడు.భారత అభిమానుల గాయాలపై కారం చల్లుతూ.. విరాట్ ఔటైన తర్వాత ప్రేక్షకుల నిశ్శబ్దం మ్యాచ్‌లోని అత్యంత అద్భుతమైన క్షణాలలో ఒకటని చెప్పాడు. విరాట్ 54 పరుగులు చేసి వెనుదిగారు. ఆస్ట్రేలియా సారధి ప్యాట్‌ కమిన్స్‌ వేసిన బంతిని కోహ్లీ డిఫెన్స్‌ ఆడగా అది బ్యాట్‌కు తగిలి వెళ్లి వికెట్లకు తగిలింది. దీంతో విరాట్‌ కోహ్లీ తీవ్ర ఆవేదనతో మైదానాన్ని వీడాడు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios