Asianet News TeluguAsianet News Telugu

ఆస్ట్రేలియా కొత్త టెస్టు సారథిగా ప్యాట్ కమ్మిన్స్... స్టీవ్ స్మిత్‌కి వైస్ కెప్టెన్సీ...

ప్యాట్ కమ్మిన్స్‌కే ఆస్ట్రేలియా ప్లేయర్ల ఓటు... స్టీవ్ స్మిత్‌కి వైస్ కెప్టెన్సీ... రెండేళ్ల తర్వాత సారథ్య బాధ్యతల్లోకి స్మిత్...  ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌కి ముందు...

Pat Cummins appointed as New Test Captain for Cricket Australia, Steve Smith gets Vice, before Ashes Series
Author
India, First Published Nov 26, 2021, 9:22 AM IST

ఆస్ట్రేలియా కొత్త టెస్టు సారథి ఎవరనేదానిపై సస్పెన్స్ వీడింది. ప్యాట్ కమ్మిన్స్, స్టీవ్ స్మిత్... ఇద్దరిలో ఒకరికి కెప్టెన్సీ దక్కుతుందని తెలిసినా, తీవ్ర ఉత్కంఠనడుమ స్టార్ పేసర్‌కే పీఠం దక్కింది. కొన్నేళ్లుగా టెస్టుల్లో అద్భుతంగా రాణిస్తూ, ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్‌లో కొనసాగుతున్నాడు ప్యాట్ కమ్మిన్స్...సెక్స్ మెసేజింగ్ స్కాండల్‌లో ఇరుక్కున్న టిమ్ పైన్, అర్ధాంతరంగా టెస్టు కెప్టెన్సీ నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. యాషెస్ సిరీస్‌కి ముందు జరిగిన ఈ సంఘటన, ఆస్ట్రేలియా క్రికెట్‌లో ప్రకంపనలు క్రియేట్ చేసింది. ఆస్ట్రేలియా టెస్టు టీమ్‌ను నడిపించబోయే 47వ కెప్టెన్‌ ప్యాట్ కమ్మిన్స్...

‘ప్యాట్ కమ్మిన్స్  ఓ అసాధారణ ఆటగాడు, అద్భుతమైన లీడర్. తన జట్టు సభ్యుల వద్ద, ప్రపంచవ్యాప్తంగా విశేషమైన అభిమానులను సంపాదించుకున్న ప్యాట్ కమ్మిన్స్, ఆన్ ఫీల్డ్, ఆఫ్ ఫీల్డ్ తన వినయవిధేయలతో గౌరవాన్ని కూడా సంపాదించుకున్నాడు. అతని సారథ్యంలో జట్టు మంచి విజయాలు అందుకుంటుందని ఆశిస్తున్నా...’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా క్రికెట్ చీఫ్ నిక్ హక్‌లీ...

‘యాషెస్ సిరీస్‌కి ముందు ఆస్ట్రేలియా జట్టును నడిపించే బాధ్యత దక్కడం గౌరవంగా భావిస్తున్నా.... టిమ్ పైన్ గత కొన్నేళ్లుగా జట్టును ఎలా నడిపించాలో, అలాగే నడిపించడానికి నా వంతు ప్రయత్నం చేస్తా...’ అంటూ తెలిపాడు ప్యాట్ కమ్మిన్స్... 

‘స్టీవ్ స్మిత్‌కి కెప్టెన్‌గా, ప్లేయర్‌గా ఎంతో అనుభవం ఉంది. అలాగే జట్టులో ఉన్న యువ ఆటగాళ్లతో కలిసి దృఢమైన శక్తిగా ఆస్ట్రేలియాను నిర్మించేందుకు ప్రయత్నిస్తాం...’ అంటూ చెప్పుకొచ్చాడు కమ్మిన్స్...
 
టిమ్ పైన్ కెప్టెన్సీలో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన ప్యాట్ కమ్మిన్స్ సారథ్య బాధ్యతలు తీసుకోవడంతో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కి వైస్ కెప్టెన్సీ దక్కింది. దాదాపు రెండేళ్ల తర్వాత తిరిగి కెప్టెన్సీ రోల్‌లో కనిపించబోతున్నాడు స్టీవ్ స్మిత్...  ఆసీస్ మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ రిటైర్మెంట్ తర్వాత అతని నుంచి పూర్తి స్థాయి టెస్టు కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్ బాధ్యతలు తీసుకున్నాడు. బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించింది ఆస్ట్రేలియా...

స్టీవ్ స్మిత్ కెప్టెన్సీలో 34 టెస్టులు ఆడిన ఆస్ట్రేలియా, 18 మ్యాచుల్లో విజయాన్ని అందుకుని, 10 మ్యాచుల్లో ఓడింది. 6 టెస్టులు డ్రాగా ముగిశాయి. అలాగే 51 వన్డేల్లో 25 విజయాలు అందుకున్న స్టీవ్ స్మిత్, 8 టీ20 మ్యాచుల్లో 4 విజయాలు అందుకున్నాడు.

ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెను భూకంపం తీసుకొచ్చింది ‘సాండ్ పేపర్’ వివాదం. సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ సమయంలో జేబుల్లో సాండ్ పేపర్ పెట్టుకుని, బాల్ టాంపరింగ్ చేయడానికి ప్రయత్నించి, అడ్డంగా దొరికిపోయారు ఆస్ట్రేలియా క్రికెటర్లు. ఈ ఎపిసోడ్ అంతటికీ ప్రధాన సూత్రధారుడిగా వ్యవహరించిన అప్పటి ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లపై ఏడాది నిషేధం కూడా పడింది. అలాగే వికెట్ కీపర్ కామెరాన్ బాంక్రాఫ్ట్‌పై కూడా ఏడాది విధించింది క్రికెట్ ఆస్ట్రేలియా...

ఈ సంఘటన ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెను ప్రకంపనలు క్రియేట్ చేసింది. సాండ్ పేపర్ వాడి బాల్ ట్యాంపరింగ్‌కి ప్రయత్నించిన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లను జైలు శిక్ష పడిన ఖైదీల్లా పోలీసుల లాక్కుంటూ తీసుకురావడం చూసి, క్రికెట్ ఫ్యాన్స్ అవాక్కయ్యారు. 2018లో జరిగిన ఈ సంఘటన తర్వాత ఆస్ట్రేలియా ఆధిక్యానికి కూడా తెర పడినట్టైంది.

అప్పటిదాకా క్రికెట్ ప్రపంచంలో తిరుగులేని శక్తిగా, ప్రత్యర్థులను వణికిస్తూ వచ్చిన ఆస్ట్రేలియా... ఈ సంఘటన తర్వాత సరైన విజయాలు అందుకోలేకపోతోంది. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌ల గైర్హజరీతో ఆస్ట్రేలియా టీమ్‌ను 2-1 తేడాతో ఓడించి టెస్టు సిరీస్ సొంతం చేసుకున్న విరాట్ సేన, 2020-21 టూర్‌లో ఈ ఇద్దరూ టీమ్‌లో ఉండగానే 2-1 తేడాతో టెస్టు సరీస్ గెలిచింది. 

చివరిగా 2017-18 సీజన్‌లో స్టీవ్ స్మిత్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ జట్టును 4-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసి టెస్టు సిరీస్ సొంతం చేసుకుంది ఆస్ట్రేలియా. గత సీజన్‌లో జరిగిన యాషెస్ సిరీస్ 2-2 తేడాతో డ్రాగా ముగిసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios