టీమిండియా క్రికెటర్, ముంబయి ఇండియన్స్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. ఆయనకు సంబంధించిన ప్రతి విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఆయన భార్య నటాషా సైతం అంతే యాక్టివ్ గా ఉంటారు.

మొన్నటి వరకు హార్దిక్ ఐపీఎల్ మ్యాచులతో చాలా బిజీగా గడిపాడు. అయితే.. అనుకోకుండా కరోనా కారణంగా ఐపీఎల్ వాయిదా పడింది. దీంతో.. కంప్లీట్ గా హార్దిక్ తన ఫ్యామిలీతో గడుపుతున్నాడు. తన ముద్దుల కొడుకు అగస్త్యతో సమయం గడుపుతున్నాడు. తాజాగా.. హార్దిక్, నటాషాల తమ చిన్నారి అగస్త్యకు అడుగులు నేర్పుతున్నారు.

ఒకవైపు హార్దిక్.. మరో వైపు నటాషా కూర్చొని.. అగస్త్య వేస్తున్న చిన్ని చిన్ని బుడి బుడి అడుగులను చూసి మురిసిపోతున్నారు. ఈ వీడియోని వారు సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

కొడుకు చూసి మురిసిపోతూ.. అడుగులు వేసేలా చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేశారు. ఈ వీడియో చాలా క్యూట్ గా ఉంది. ఈ వీడియోలో అగస్త్య సైతం చాలా క్యూట్ గా కనపడుతున్నాడు.