Worldcup 2023: వరల్డ్ కప్ నుండి హార్దిక్ పాండ్యా అవుట్..!
ఫిట్నెస్ పరీక్షలో సైతం పాండ్యా ఫెయిల్ అయ్యాడని బీసీసీఐ పేర్కొంది. ఫలితంగా వరల్డ్ కప్ టోర్నమెంట్ నుంచి పాండ్యా వైదొలగాల్సి వచ్చింది.
వన్డే వరల్డ్ కప్ 2023 లో టీమిండియా విజయాల పరంపర కొనసాగిస్తోంది. టీమిండియా జోరు చూసి ఫ్యాన్స్ సైతం సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే రోహిత్ సేన సెమిస్ కి కూడా చేరుకుంది. ఇలాంటి సమయంలో జట్టుకి ఊహించని షాక్ తగిలింది. జట్టు లో కీలక వ్యక్తి ఇప్పుడు టీమ్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. స్టార్ ఆల్ రౌండర్, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను వరల్డ్ కప్ టోర్నీ నుంచి దూరం చేశారు. ఈ మేరకు ఐసీసీ కీలక ప్రకటన చేసింది.
అయితే, హార్దిక్ పాండ్యాను తప్పించడానికి కారణం లేకపోలేదు. గత కొంతకాలంగా పాండ్యా గాయంతో బాదపడుతున్నాడు. అయితే, ఆ గాయం నుంచి ఆయన ఇంకా కోలుకోలేదు. ఆయన కచ్చితంగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. అంతేకాదు, ఫిట్నెస్ పరీక్షలో సైతం పాండ్యా ఫెయిల్ అయ్యాడని బీసీసీఐ పేర్కొంది. ఫలితంగా వరల్డ్ కప్ టోర్నమెంట్ నుంచి పాండ్యా వైదొలగాల్సి వచ్చింది.
పాండ్యా టోర్నీ నుంచి తప్పుకోవడం టీమిండియా కాస్త షాకింగ్ విషయమే. ఫ్యాన్స్ సైతం ఈ వార్త విని నిరుత్సాహానికి గురౌతున్నారు. ఇక, పాండ్యా స్థానాన్ని యువ పేసర్ ప్రసిద్ కృష్ణ తో భర్తీ చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఐసీసీ ప్రకటన కూడా విడుదల చేసింది.
ఇదిలా ఉండగా, ప్రపంచకప్ 2023 లీగ్ దశలో భాగంగా పూణేలో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. తన బౌలింగ్ లో బంగ్లా బ్యాటర్ బాదిన షాట్ ని అడ్డుకునే క్రమంలో పట్టుతప్పి పడిపోయాడు. ఆ సమయంలో కాలికి తీవ్రంగా గాయమైంది. గాయం తీవ్రత ఎక్కువ కావడంతోనే, ఇప్పుడు ఏకంగా టోర్నమెంట్ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.