మహేంద్ర సింగ్ ధోని... అభిమానుకే కాదు టీమిండియా యువ క్రికెటర్లు కూడా అతడంటే చాలా ఇష్టపడతారు. మరీ ముఖ్యంగా కొత్తగా జట్టులోకి వచ్చిన ఆటగాళ్లు క్రికెట్  మెలకువలు నేర్చుకోడానికి ప్రయత్నిస్తూ ధోనికి మాత్రమే సాధ్యమయ్యే షాట్లను అనుకరనిస్తుంటారు. ఇలా సాంప్రదాయ క్రికెట్ షాట్లకు భిన్నంగా అతడి బ్యాట్ నుండి జాలువారే హెలికాప్టర్ షాట్లంటే వారు మరింతగా ఇష్టపడతారు. ఇలా ధోనికి మాత్రమే సాధ్యమయ్యే ఈ షాట్లను యువ ఆటగాడు హార్దిక్ పాండ్యా అనుకరించాడు.  

మరికొద్దిరోజుల్లో ఆరంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం అన్ని జట్లకు చెందిన ఆటగాళ్ళంతా సిద్దమవుతున్నారు. ఈ క్రమంలో ముంబయి ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే హార్ధిక్ ప్రాక్టిస్ మొదలుపెట్టాడు. ఈ సందర్భంగా నెట్స్ లో అతడు ధోని మార్క్ హెలికాప్టర్ షాట్లను ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. ఇలా ప్రాక్టిస్ చేస్తున్న వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ ''  ఈ  షాట్ కోసం నాకు స్పూర్తినిచ్చిన ఆటగాడెవరో గుర్తుపట్టారా?'' అంటూ పాండ్యా నెటిజన్లను ప్రశ్నించారు. 
 
పాండ్యా పోస్ట్ చేసిన ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ధోని అభిమానులతో పాటు చెన్నై కింగ్స్ జట్టు ఫాలోవర్స్ ఈ పోస్టుపై వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తూ...ఇతర సోసల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. ఏ జట్టు ఆటగాడైనా మా సారథి (ధోని) ని ఫాలో కావాల్సిందేనంటూ చెన్నై జట్టు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.