టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకు తాజా సంఘటనే చక్కని ఉదాహరణ. ఓ పాక్ క్రికెట్ అభిమాని... కోహ్లీని ఓ విన్నపం కోరాడు. తమ దేశంలో వచ్చి  ఆడాలని కోరడం విశేషం.

ఇంతకీ మ్యాటరేంటంటే.. పాకిస్తాన్-శ్రీలంక జట్ల మధ్య బుధవారం మూడో టీ 20 మ్యాచ్ లాహోర్ లో జరిగింది. ఈ సందర్భంగా షాబాజ్ షరీఫ్ అనే ఓ అభిమాని.. కోహ్లీకోసం  ఓ సందేశం పంపాడు. ఓ ప్లకార్డు పట్టుకొని దాని మీద  కోహ్లీ మీరు పాకిస్తాన్ లో క్రికెట్ ఆడితే చూడాలని ఉందని అని రాసి పట్టుకొని స్టేడియంలో తిరుగుతూ కనిపించాడు.

కాగా... అతని ప్లకార్డు మీద ఉంచిన సందేశం ఆసక్తికరంగా ఉండటంతో మీడియా తమ కెమేరాకు పని చెప్పింది. అతని ఫోటోలను తీయగా.. ఆ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.  తన ఫోటోలను షాబాజ్ కూడా సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఆ ఫోటోకి ఓ ట్వీట్ జత చేశాడు. కోహ్లీ తమ దేశం వచ్చి ఆడితే... తనకు చూడాలని ఉందని పేర్కొంటూ ట్వీట్ చేశాడు. మరి ఈ అభిమాని కోరికకు కోహ్లీ ఎలా స్పందిస్తారో చూడాలి. 

కోహ్లీ కన్నా ముందే..అతని అభిమానులు ఆ ట్వీట్ కి స్పందించారు. మీ కోరిక ఏదో ఒక రోజు నిజమౌతుంది అంటూ కొందరు ట్వీట్లు చేస్తుండటం విశేషం.