ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 29న పాకిస్తాన్-న్యూజిలాండ్ వార్మప్ మ్యాచ్ జరగాల్సి వుంది. అయితే భద్రతా కారణాలతో ఈ మ్యాచ్‌ను ప్రేక్షకులు లేకుండా నిర్వహించాలని హెచ్‌సీఏ భావిస్తోంది. 

ఉప్పల్ స్టేడియంలో వన్డే వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్ నిర్వహణపై గందరగోళం నెలకొంది. ఈ నెల 29న పాకిస్తాన్-న్యూజిలాండ్ వార్మప్ మ్యాచ్ జరగాల్సి వుంది. అయితే ఈ నెల 28న గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీతో మ్యాచ్‌కు భద్రత కల్పించలేమని పోలీసులు తేల్చి చెప్పేశారు. దీంతో ప్రేక్షకులు లేకుండా మ్యాచ్ నిర్వహించాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ భావిస్తోంది. బీసీసీఐ నిర్ణయం కోసం హెచ్‌సీఏ ఎదురుచూస్తోంది. అయితే ఇప్పటికే వార్మప్ మ్యాచ్ కోసం హెచ్‌సీఏ టికెట్ల విక్రయాలు ప్రారంభించింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred