ఈ 15ఏళ్ల కాలంలో తనకు  పాకిస్తాన్ క్రికెట్ బోర్డు,  అభిమానులు, తోటి ఆటగాళ్లు అందరూ సపోర్ట్ గా నిలిచారని, వారందరికీ తాను దన్యవాధాలు తెలుపుతున్నట్లు చెప్పాడు.

పాకిస్తాన్ క్రికెటర్ సోహైల్ ఖాన్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. పాక్ వెటరన్ ఫాస్ట్ బౌలర్ అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికాడు. సోహైల్ ఖాన్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటన్నానని, అయితే, డొమెస్టిక్ వైట్ బాల్ క్రికెట్, ఫ్రాంచైజీ క్రికెట్ లో మాత్రం తాను కొనసాగుతానని చెప్పడం విశేషం.

తాను క్రికెటర్ గా 15ఏళ్ల పాటు ప్రయాణం కొనసాగించానని చెప్పాడు. ఈ 15ఏళ్ల కాలంలో తనకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, అభిమానులు, తోటి ఆటగాళ్లు అందరూ సపోర్ట్ గా నిలిచారని, వారందరికీ తాను దన్యవాధాలు తెలుపుతున్నట్లు చెప్పాడు.

ఇక సోహైల్ ఖాన్ 2008 జింబాబ్వేతో జరిగిన వన్డే మ్యాచ్ తో తన అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెటటాడు. అతను చివరిసారి 2016లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ లో కనిపించాడు. తర్వాత మళ్లీ ఆడలేదు. ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటించారు. సోహైల్ తన కెరీర్ లో 9 టెస్టు మ్యాచ్ లు, 13 వన్డేలు, 5 టీ20 మ్యాచ్ లు పాకిస్తాన్ తరపున ఆడాడు. టెస్టులో మంచి ట్రాక్ రికార్డు ఉంది.