Asianet News TeluguAsianet News Telugu

పుచ్చకాయలా పాకిస్తాన్ టీ20 ప్రపంచకప్ జెర్సీ.. ఆటాడుకుంటున్న నెటిజన్లు

Pakistan T20I Jersey: ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సి ఉన్న పొట్టి ప్రపంచకప్ కోసం ఇప్పటికే జట్టును ప్రకటించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తాజాగా  ఆ ఆటగాళ్లు ధరించే కొత్త జెర్సీని విడుదల చేసింది.  

Pakistan Reveals New Jersey For T20I World Cup 2022, Fans calls Water Melon
Author
First Published Sep 19, 2022, 7:06 PM IST

టీమిండియా కొత్త జెర్సీపై ట్రోలింగ్ కు దిగిన పాకిస్తాన్ అభిమానుల గూబ గుయిమనిపిస్తున్నారు నెటిజన్లు. భారత జట్టు టీ20 ప్రపంచకప్ లో ధరించబోయే జెర్సీమీద సెటైర్లు వేసిన పాకిస్తాన్ ఫ్యాన్స్ కు ఆ దేశ క్రికెట్ బోర్డు రూపంలో ఊహించని షాక్ తగిలింది.  పీసీబీ తాజాగా విడుదల చేసిన  ‘థండర్ జెర్సీ’పై భారత్ లో కాదు.. ఏకంగా పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ సైతం ట్రోలింగ్ కు దిగుతున్నారు.  కొత్త జెర్సీని పుచ్చకాయతో పోలుస్తున్నారు.  పుచ్చకాయకు పాకిస్తాన్ జెర్సీకి తేడా ఏమీ లేదని  ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. 

పాకిస్తాన్ క్రికెట్ ట్విటర్ లో విడుదల చేసిన వీడియోకు సంబంధించి నెటిజన్లు.. పీసీబీని ఓ ఆటాడుకుంటున్నారు. ఈ జెర్సీ  ధరించే రెగ్యులర్ ‘ఆకుపచ్చ’ రంగులో ఉండి దాని మీద  చారలతో కూడిన లైన్లు వచ్చాయి.  ఇది చూడటానికి అచ్చం పుచ్చకాయ మాదిరే ఉంది.  

ఈ జెర్సీకి సంబంధించిన  వీడియో పీసీబీ ట్విటర్ లో పోస్ట్ చేయకముందే  ఆ ఫోటోలు  సోషల్ మీడియాలో లీకయ్యాయి. దీంతో నెటిజన్లు పీసీబీని ఓ ఆటాడుకుంటున్నారు.  పలువురు నెటిజన్ల స్పందన ఇలా ఉంది.. ‘పాకిస్తాన్ లో పెరుగుతున్న కూరగాయలకు ఈ జెర్సీ అంకితం..’, ‘ఇదేంటి జెర్సీ అని పుచ్చకాయలను వేసుకున్నారు..’, ‘ఒక్క పుచ్చకాయలేనా..? ఇంకేమైనా కూరగాయలు పెట్టారా..?’,  ‘పాకిస్తాన్ లో పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు ఈ జెర్సీ సూచికనా..?’, ‘రండి బాబు రండి.. పుచ్చకాయ జెర్సీ.. వంద శాతం డిస్కౌంట్..’ అని కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు.  

 

ఇక పలువురు మీమర్స్.. పీసీబీ జెర్సీ పై  సందర్భోచిత మీమ్స్ వేస్తూ ఫన్ ను పంచుతున్నారు. ఈ మీమ్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.  

 

 

 

 

టీ20 ప్రపంచకప్ కు పాకిస్తాన్ : బాబర్ ఆజమ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), అసిఫ్ అలీ, హరీస్ రౌఫ్, ఇఫ్తికార్ అహ్మద్, ఖుష్దిల్ షా, మహ్మద్ హస్నేన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం, నసీం షా, షాహీన్ షా అఫ్రిది,  షాన్ మసూద్, ఉస్మాన్ ఖాదిర్ 

Follow Us:
Download App:
  • android
  • ios