గత ఏడాది ఫిబ్రవరిలో అవినీతి ఆరోపణలతో నిషేధానికి గురైన పాక్ క్రికెటర్ ఉమర్ అక్మల్‌కి పాక్ క్రికెట్ బోర్డు ఓ స్పెషల్ ఆఫర్ ఇచ్చింది. 31 ఏళ్ల ఉమర్ అక్మల్, 2019లో చివరిసారిగా పాక్ జట్టుకి క్రికెట్ ఆడాడు. ఆ తర్వాత యాంటీ కరెప్షన్ కోడ్‌ను ఉల్లంఘించడంతో ఉమర్ అక్మల్‌ను 18 నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండా నిషేధం విధించింది పీసీబీ.

అయితే ఇప్పటికే 12 నెలల బ్యాన్ పూర్తిచేసుకున్న ఉమర్ అక్మల్, వెంటనే రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తే, జరిమాని కట్టి రావచ్చని తెలిపింది పాక్ క్రికెట్ బోర్డు. ‘ఉమర్ ఇప్పటికే రూ.45 లక్షల రూపాయలు బోర్డు ఖాతాలో డిపాజిట్ చేశాడు.

దీంతో అతను రీఎంట్రీ ఇచ్చేందుకు అర్హత సాధించినట్టే... అయితే ప్రస్తుతం పాక్ బోర్డు పీఎస్ఎల్ నిర్వహణ పనుల్లో బిజీగా ఉండడంతో అక్మల్ రీఎంట్రీ కోసం కొంత కాలం వేచి ఉండాలి...’ అంటూ తెలిపాడు పీసీబీ అధికారి.