ప్రస్తుత కాలంలో క్రికెట్ పై ఎక్కువగా ఆదరణ పెరుగుతోంది అంటే అది టీ20ల ప్రభావమనే చెప్పాలి. జనాలకు మంచి కిక్కుస్తున్న ఈ ఫార్మాట్ పై అన్ని దేశాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఏ పర్యటనకు వెళ్లినా నేషనల్ టీమ్స్ టీ20 మ్యాచ్ ఆడకుండా రావడం లేదు. అయితే 2004 నుంచి మొదలైన ఈ ఫార్మాట్ లో అన్ని దేశాలకంటే ఎక్కువ టీ20 మ్యాచ్ లు ఆడిన దేశంగా పాకిస్థాన్ నిలిచింది.

పాకిస్ధాన్ క్రికెట్ టీమ్ రీసెంట్ గా లాహోర్ వేదికగా బాంగ్లాదేశ్ తో టీ20 మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ లో పాక్ 5 వికెట్ల తేడాడో విజయాన్ని అందుకుంది. దీంతో 150 టీ20 లు ఆడిన మొదటి దేశంగా పాకిస్థాన్ రికార్డును అందుకుంది. ఇంగ్లాడ్ తో మొదటి సారి 2006లో 20 ఓవర్ల మ్యాచ్ ఆడిన పాకిస్ధాన్ ఆ తరువాత వన్డే - టెస్ట్ ల కంటే ఎక్కువగా ఇదే ఫార్మాట్ కి ప్రాముఖ్యత ఇచ్చింది.

మొత్తంగా ఈ మ్యాచ్ లలో పాక్ 90 మ్యాచ్ లలో గెలుపొందగా 55 మ్యాచ్ లలో ఓటమి చెందింది. మిగిలిన నాలుగు మూడు టై కాగా.. మరో మ్యాచ్ లో ఫలితం తేలలేదు. ఇక భరత్ అత్యధిక టీ20 లు ఆడిన రెండవ జట్టుగా కొనసాగుతోంది. టీమిండియా మొత్తంగా 129 మ్యాచ్ లు అడగా అందులో 81 వాటిలో విజయం సాధించగా 44 మ్యాచ్ లలో ఓటమి చెందింది. మిగిలిన నాలుగు మ్యాచ్ లలో ఫలితం తేలలేదు. ప్రస్తుతం కోహ్లీ సేన న్యూజిలాండ్ పర్యటనలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. శుక్రవారం జరిగిన మొదటి టీ20లో ఇండియా ఆరు వికెట్లతో విజయాన్ని అందుకుంది.