ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే సీరిస్ ను పాకిస్థాన్ ఇప్పిటకే కోల్పోయిన విషయం తెలిసిందే. నాటింగ్ హామ్ లో శుక్రవారం జరిగిన నిర్ణయాత్మక  నాలుగో వన్డేలోనూ పాక్ భారీ స్కోరు సాధించినప్పటికి ఓటమిపాలయ్యింది. దీంతో మరో మ్యాచ్ మిగిలుండగానే ఐదు వన్డేల సీరిస్ ఆతిథ్య జట్టు వశమయ్యింది. అయితే సీరిస్ కోల్పోయినప్పటికి పాక్ ఖాతాలో ఓ అరుదైన రికార్డు వచ్చి  చేరింది. 

వరుసగా మూడు మ్యాచుల్లో మూడు వందల నలబైకి పైగా పరుగులు సాధించిన జట్టుగా పాక్ నిలిచింది. మొదటి వన్డే వర్షం కారణంగా రద్దవగా రెండో  వన్డేలో 361, మూడో వన్డేలో 358, నాలుగో వన్డేలో 340 స్కోరును పాక్ సాధించింది. ఇలా బ్యాట్ మెన్స్ అద్భుతంగా రాణించి పాక్ కు అరుదైన రికార్డును సాధించిపెట్టారు.అయితే బౌలర్లు ఘోరంగా   విఫలమవడంతో ఈ మూడు మ్యాచుల్లోనూ ఓటమిపాలవ్వాల్సి వచ్చింది. రికార్డు స్థాయిలో భారీ స్కోరు సాధించిన ద వాటిని కాపాడుకోలేక పాక్ ఓడిపోవాల్సి వచ్చింది.

ఇక ఇదే సీరిస్ లో ఆతిథ్య జట్టు ఖాతాలోకి  కూడా ఈ రికార్డు చేరింది. ఇంగ్లాండ్ కూడా వరుస మ్యాచుల్లో 340 కి పైగా పరుగులను సాధించి పాక్ తర్వాతి స్థానాన్ని ఆక్రమించింది. ఇంగ్లీష్ జట్టు రెండో వన్డేలో 373, మేడో వన్డేలో 359, నాలుగో వన్డేలో 341 పరుగులు చేసింది. ఇలా వరుస మ్యాచుల్లో భారీ పరుగులు  సాధించి విజయాన్ని కైవసం చేసుకున్నప్పటికి పాక్ తర్వాతే ఈ ఘనత సాధించిన జట్టుగా  ఇంగ్లాండ్ నిలిచింది. 

నాలుగో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ బాబర్ అజాం(115), ఫకార్ జమాన్(57), షోయబ్ అక్తర్(41) రాణించడంతోని నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది. 341 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఓపెనర్ జేసన్ రాయ్(114), బెన్‌స్టోక్స్(71), జేమ్స్ విన్స్(43), టామ్ కర్రన్(31) మెరుపులు మెరిపించడంతో సునాయాసంగా విజయాన్ని అందుకుంది. ఇలా  వరుసగా మూడు వన్డేల్లో విజయం సాధించి 3-0తో ఇంగ్లాండ్ సీరిస్ కైవసం చేసుకుంది.