ఈ మ్యాచ్ లో పాక్ క్రికెటర్ ఇమ్రాన్ బట్.. టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. అరంగేట్రంలోనే అదరగొట్టాడు. తొలి మ్యాచ్ లోనే అద్భుతమైన క్యాచ్ తో బోణి కొట్టి అదరహో అనిపించాడు.

రెండు టెస్ట్‌ల సిరీ్‌సలో భాగంగా పాకిస్థాన్‌-దక్షిణాఫ్రికా మధ్య మంగళవారం మొదలైన ఆరంభ టెస్ట్‌లో తొలిరోజు బౌలర్ల హవా సాగింది. ఇరుజట్ల బౌలర్ల వీరవిహారంతో మొదటి రోజే 14 వికెట్లు నేలకూలాయి. కాగా... ఈ మ్యాచ్ లో పాక్ క్రికెటర్ ఇమ్రాన్ బట్.. టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. అరంగేట్రంలోనే అదరగొట్టాడు. తొలి మ్యాచ్ లోనే అద్భుతమైన క్యాచ్ తో బోణి కొట్టి అదరహో అనిపించాడు.

దక్షిణాఫ్రికా ఓపెనర్ ఐడెన్ మార్క్రామ్ ని ఇమ్రాన్ తన అద్భుతమైన క్యాచ్ పట్టి పెవీలియన్ కి పంపించాడు. ఎవరూ ఊహించని విధంగా ఇమ్రాన్ క్యాచ్ పట్టాడు. కాగా.. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇమ్రాన్ అద్భుతమైన క్యాచ్ తో అరంగేట్రం చేశాడంటూ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ట్విట్టర్ లో ఆ వీడియోని షేర్ చేసింది. దీంతో.. ఇమ్రాన్ బట్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అతనిని పాక్ అభిమానులంతా సోషల్ మీడియాలో పొగిడేస్తున్నారు.

Scroll to load tweet…

ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా.. యాసిర్‌ షా (3/54), నౌమన్‌ అలీ (2/38), షహీన్‌ షా అఫ్రీది (2/49) దెబ్బకు తొలి ఇన్నింగ్స్‌లో 220 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్‌ డీన్‌ ఎల్గర్‌ (58) టాప్‌ స్కోరర్‌. జార్జ్‌ లిండే 35, డుప్లెసి 23 రన్స్‌ చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన పాక్‌ ఆట చివరకు 33/4తో కష్టాల్లో పడింది. ఓపెనర్లు ఇమ్రాన్‌ బట్‌ (9), అబిద్‌ అలీ (4) విఫలమయ్యారు. రబాడ (2/8) రెండు వికెట్లు పడగొట్టగా.. నోకియా, కేశవ్‌ మహరాజ్‌ చెరో వికెట్‌ తీశారు. అజర్‌ అలీ (5 బ్యాటింగ్‌), ఫవాద్‌ ఆలమ్‌ (5 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు